Sushmita Sen : మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ నటి సుస్మితాసేన్ గత కొంత కాలం నుంచి తన బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో కలసి సహజీవనం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా హల్ చల్ చేశాయి. అయితే తాజాగా ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు బీ టౌన్ నుంచి సమాచారం వినబడుతోంది. అంతేకాకుండా ఈ వార్తకు తగ్గట్టు సుస్మితాసేన్ చేసిన పోస్ట్ కూడా ప్రస్తుతం తమ అభిమానులను కలవర పెడుతోంది.
సుస్మితాసేన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ…. అతడు మారుతాడని మహిళ భావిస్తుంది. కాని పురుషులు ఎప్పుడు ఎన్ని తప్పులు చేసిన ఆమె భరిస్తుంది, క్షమిస్తుంది కానీ అతనిని వదిలి వెళ్ళదు అనుకుంటారు. కానీ ఈ కథలో మాత్రం అతడిని వదిలి ఆమె వెళ్తుంది అంటూ సుస్మితాసేన్ సోషల్ మీడియా ద్వారా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
అభిమానుల కలవరపాటు నిజమేనా:
సుస్మితాసేన్ కేవలం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడమే కాకుండా తన ఇద్దరు కూతుర్లు తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ.. ఒకరికొకరం ఎల్లప్పుడు వెన్నంటే ఉంటామంటూ క్యాప్షన్ జోడించారు. అయితే ఈ ఫోటోలు తన ఇద్దరు కూతుర్లు మాత్రమే ఉండి రోహమాన్ లేకపోవడంతో వీరిద్దరు నిజంగానే బ్రేకప్ చేసుకున్నారని తన అభిమానులు కలవరపడుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య బ్రేకప్ నిజమేనని ఇక అధికారికంగా మాత్రమే తెలియజేయాల్సి ఉందని ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సుస్మితా కంటే 15 సంవత్సరాల చిన్నవాడైన కశ్మీర్ మోడల్‌తో సుస్మిత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ దగ్గర దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.అంతేకాకుండా వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను ఎప్పుడూ అభిమానులతో పంచుకునే సుస్మితాసేన్ పేరును కూడా రోహమాన్ పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఇంత సాన్నిహిత్యం ఉన్న వీరిద్దరి మధ్య బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!