ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తొలి చిత్రం సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ కృష్ణ, రామ్‌చరణ్, రానా దగ్గుబాటి, పార్లమెంట్ సభ్యులు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, నన్నపనేని రాజకుమారి, అమల అక్కినేని, నమ్రత శిరోద్కర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లోగోను ఆవిష్కరించారు.
నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో నరేశ్, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్ క్లాప్ ఇవ్వగా రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూపర్‌స్టార్ కృష్ణ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. సూపర్‌స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, పద్మావతి గల్లా, జయదేవ్ గల్లా స్క్రిప్ట్‌ను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు అందించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!