Avatar 2 Trailer: 2009వ సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామరూన్ డైరెక్షన్ లో వచ్చిన “అవతార్” ప్రపంచ సినీ ప్రేమికులకు విజువల్ ట్రీట్ ఇవ్వడం తెలిసిందే. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు అవతార్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న “అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 16వ తారీకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో ఎప్పటికీ ఈ సినిమాకి సంబంధించి మొదటి ట్రైలర్ కొన్ని వారాల క్రితం విడుదలయ్యింది. తాజాగా ఇప్పుడు మరో ట్రైలర్ విడుదల చేశారు. ఈ రెండో ట్రైలర్ లో విజువల్ వండర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు.
మొదటి ట్రైలర్ లో ఎమోషన్స్ కి యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేయగా.. ఇప్పుడు రెండో ట్రైలర్ లో… తమ జాతిని కాపాడుకునే క్రమంలో చూపించిన యుద్ద సన్నివేశాలు.. కళ్ళు చెదిరేటట్టు ఉన్నాయి. ఫైట్స్ మరియు యాక్షన్స్ సన్నివేశాలు ఇంకా సెట్టింగ్స్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సన్నివేశం చాలా ఆకట్టుకుంటూ ఉంది. కెమెరా వర్క్ ఇంకా గ్రాఫిక్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. అన్నీ కూడా సమపాలల్లో ఉన్నాయి. డిసెంబర్ 16వ తారీకు ప్రపంచవ్యాప్తంగా 160 భాషలలో విడుదల కానున్న “అవతార్ 2″… తెలుగులో కూడా విడుదల చేస్తూ ఉన్నారు.
దీంతో తెలుగు “అవతార్ 2” రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీగా పోటీ పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ రిలీజ్ కి సంబంధించిన 120 కోట్లు వరకు రేటు పలుకుతున్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. “అవతార్” భారీ హిట్ కావటంతో సెకండ్ పార్ట్ కి సంబంధించి స్టార్టింగ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వస్తే బిజినెస్ ఇంకా వేరే లెవెల్ లో ఉంటుందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
On December 16, experience the motion picture event of a generation.
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. Get tickets now: https://t.co/9NiFEIpZTE pic.twitter.com/UitjdL3kXr
— Avatar (@officialavatar) November 22, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!