Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి క్రేజ్ రోజు రోజుకి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. “RRR”, బాహుబలి 2 సినిమాలు సృష్టించిన రికార్డులు జక్కన్నకి విపరీతమైన క్రేజ్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా “RRR” అనేకమైన అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడం తెలిసిందే. ఆస్కార్ రేసులో కూడా “RRR” ఉంది. ఈ సినిమా చూసిన చాలామంది హాలీవుడ్ ప్రముఖులు రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. హాలీవుడ్ సినిమా ప్రపంచ ప్రముఖులు మరియు ప్రేక్షకులు రాజమౌళి పనితనానికి బాగా ఫిదా అయిపోయారు. అంతర్జాతీయంగా రాజమౌళికి విపరీతమైన క్రేజ్ ఇప్పుడు నెలకొంది.
ఈ పరిణామంతో ఇండియన్ సినిమా స్థితిగతులు మొత్తం మారిపోయాయి. ఈ క్రమంలో వరల్డ్ సినిమా మేకింగ్ మాస్టర్ అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్… రాజమౌళికి బిగ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. హాలీవుడ్ లో సినిమా చేయాలని ఉంటే కలిసి పని చేద్దామని స్వయంగా తన మనసులో ఉన్న మాట బయట పెట్టడం జరిగింది. ఓ అంతర్జాతీయ అవార్డు వేడుకల కార్యక్రమంలో రాజమౌళితో దాదాపు నాలుగు నిమిషాల పాటు జేమ్స్ కామెరూన్ మాట్లాడటం జరిగింది. ఆ వీడియోలో..”నీ సినిమాలో కథ యొక్క లోతైన భావాన్ని తెలియజేసే సెట్ అప్ లు.. పాత్రల మధ్య భావోద్వేగకరమైన సన్నివేశాలు నన్ను చాలా ఆశ్చర్యపరిచాయి. ఈ క్రమంలో అటువంటి సినిమాని ఎంతో ఆదరించిన మీ దేశ ప్రజలు మిమ్మల్ని… ప్రపంచంలోనే టాప్ స్థానంలో నిలబెట్టినట్లే. మీరు వారికి కృతజ్ఞులై ఉండాలి.
హాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా చేయాలనుకుంటే మనం కలిసి మాట్లాడుకుందాం అని జక్కన్న కి ఆఫర్ ఇవ్వటం జరిగింది. ఇదే సమయంలో జేమ్స్ కామెరూన్ భార్య పక్కనే ఉండి నా భర్త మీ సినిమాని రెండుసార్లు చూశారని రాజమౌళికి తెలియజేశారు. ప్రతి సన్నివేశం ఎంతో శ్రద్ధతో చూశారు. మధ్యలో పిల్లలు గోల చేస్తున్న వాళ్లని… సైలెంట్ పరిచి.. చాలా ఇంట్రెస్ట్ గా చూడటం జరిగింది. చాలా అద్భుతంగా సినిమాని చిత్రీకరించారు అని రాజమౌళిని పొగిడారు. ఈ క్రమంలో “RRR”… కేవలం 32 రోజుల్లోనే కంప్లీట్ చేసినట్లు జక్కన చెప్పటంతో జేమ్స్ కామెరూన్ ఆశ్చర్య పోవడం జరిగింది. అయితే హాలీవుడ్ జేమ్స్ కామెరూన్ ఆఫర్ విషయంలో మాత్రం జక్కన్న స్మైల్ ఇచ్చి సైలెంట్ అయిపోయారు. చేస్తారో…. లేదో అనేది మాత్రం చెప్పలేదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!