Veerasimhareddy: నందమూరి నరసింహ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహారెడ్డి.. ఈ సినిమా జనవరి 12న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. బాలకృష్ణ చిరంజీవి మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. ఇక బాలయ్య ఈ సినిమా లో పొలిటికల్ పంచ్ వేయడానికి ప్రిపేర్ అయినట్టు.. అదే సినిమాకు కీలకమని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

నందమూరి బాలకృష్ణ సినిమా అంటే… పొలిటికల్ పంచ్‌లు లేకపోతే ఎలా? సింహా, లెజెండ్ లో… పొలిటికల్ డైలాగులు వరుస కట్టాయి. అప్పటి పొలిటికల్ సినారియోకి అనుగుణంగా రాసిన ఆ సంభాషణలు థియేటర్లో ఓ మోత మోగించాయి. పాలిటిక్స్ ని టచ్ చేయడానికి ఏ చిన్న అవకాశాన్నీ బాలయ్య వదులుకోడు. ఎందుకంటే తాను కూడా రాజకీయ రంగంలో ఉన్నాడు కాబట్టి. ఈ సంక్రాంతికి రాబోతున్న ‘వీర సింహారెడ్డి’లో సైతం… రాజకీయాలకు సంబంధించిన పదునైన డైలాగులు పేలబోతున్నాయని టాక్. ‘ఆల్ ఫ్రీ’ పై బాలయ్య ఓ రేంజ్‌లో సైటర్లు వేశాడని, ఆ సీన్… థియేటర్లో ప్రకంపనలు సృష్టించబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. పాలన అంటే ఎలా ఉండాలి? అనే పాయింట్ పై బాలయ్య దాదాపు మూడు పేజీల డైలాగ్ చెప్పాడని.. ఈ డైలాగ్, సీన్ సినిమాకే హైలెట్ కాబోతోందని తెలుస్తోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం ‘ఆల్ ఫ్రీ’ మంత్రం జపిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత పధకాలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతోందని ఆర్థిక నిపుణులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య పలికే సంభాషణలు.. సూటిగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ఉంటాయని సమాచారం. ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ… అవన్నీ జగన్‌ని ఉద్దేశించినవే అని తెలిసేలా ఆ సంభాషణలు మలిచారని తెలుస్తోంది. మరి ఆ డైలాగులు ఏ రేంజ్‌లో పేలాయో తెలియాలంటే ఈనెల 12 వరకూ ఆగాల్సిందే..
బాలయ్య సినిమాలో పొలిటికల్ పంచ్‌లు కామన్. ఆ మాటకొస్తే సింహా, లెజెండ్ చిత్రాల్లో పొలిటికల్ డైలాగులు బాగానే పేలాయి. బాలయ్య పాలిటిక్స్ ని టచ్ చేయడానికి ఏ చిన్న వచ్చినా వదలడు.. ఎందుకంటే ఆయన కూడా పొలిటికల్ లీడర్ కాబట్టి. వీర సింహారెడ్డిలో సినిమాలో కూడా పదునైన పొలిటికల్ పంచ్ డైలాగులు పేలబోతున్నాయని సమాచారం. అన్ని ఉచితం అనే కాన్సెప్ట్ పై బాలకృష్ణ ఓ రేంజ్ లో సైటర్లు వేశాడని.. ఆ సీన్… థియేటర్లో చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాల టాక్. బాలకృష్ణ ప్రజా పాలన అంటే ఎలా ఉండాలి? అనే పాయింట్ పై ఓ మూడు పేజీల డైలాగ్ అలుపు లేకుండా చెప్పారని.. ఈ డైలాగ్, సీన్ సినిమాకే హైలెట్ కాబోతోందని టాక్.
ఆంధ్రపదేశ్ సీఏం జగన్ ఉచిత పథకాల మంత్రం జపిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత పధకాలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతోందని ఆర్థిక నిపుణులు కూడా గగ్గోలు పెడుతున్నారు. పైగా ప్రజలు సోమరిపోతుల్లా అయిపోతారు. కష్టపడకుండా ఉచితంగా ఇచ్చే వాటి పై ఆధారపడితే ప్రభుత్వం పరిస్థితి గురించి బాలయ్య వేసే పొలిటికల్ పంచ్ లు నేరుగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ఉంటాయని టాక్. ఆ డైలాగ్స్ జగన్‌ని ఉద్దేశించినవే అని సమాచారం. బాలయ్య ఈ సినిమాతో రెండు విధాలు లాభపడనున్నారు. ఒకటి రెమ్యూనరేషన్ అయితే మరొకటి పొలిటికల్ ఇంటెన్షన్.. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.