న్యూస్ సినిమా

Bheemla nayak: రాసి పెట్టుకోండి..చెప్పిన తేదీకి పక్కా వచ్చేస్తున్నా..అక్కడ ఒక రోజు ముందే

Share

Bheemla nayak: రాసి పెట్టుకోండి..చెప్పిన తేదీకి పక్కా వచ్చేస్తున్నా..అక్కడ ఒక రోజు ముందే అని భీమ్లా నాయక్ అంటున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా మరోసారి అన్నీ సినిమాలను వాయిదా వేస్తూ వస్తున్నారు. జనవరి నెలలో సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయి మళ్ళీ రీ షెడ్యూల్ అవుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాల కోసం భీమ్లా నాయక్ వెనక్కి తగ్గి ఫిబ్రవరి 25న రిలీజ్ అని మళ్ళీ కొత్త డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా థర్డ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు మరీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద సినిమాలను మళ్ళీ కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేస్తే మంచిదని భావిస్తున్నారు.

bheemla-nayak-no change in release date
bheemla-nayak-no change in release date

ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లా నాయక్ కూడా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా వేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే యూఎస్ రిలీజ్‌కు సంబంధించిన పనులన్నీ దాదాపు చివరి దశకు చేరుకున్నాయని..ఫిబ్రవరి 24న అక్కడ భీమ్లా నాయక్ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేస్తారని తాజా సమాచారం. ఇక మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 25న దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారట.

Bheemla nayak: అందరిలోనూ విపరీతమైన అంచనాలను పెంచాయి.

ఈ మేరకు మరోసారి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఇస్తూ త్వరలో రిలీజ్ తేదీతో కూడుకున్న పోస్టర్‌ను వదలనున్నారట. సాగర్ కె చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, ఓ సాంగ్, డైలాగ్స్ అందిస్తున్నారు. సంగీతం థమన్ అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ వచ్చి అందరిలోనూ విపరీతమైన అంచనాలను పెంచాయి. ఒకవేళ మేకర్స్ ప్రకటించిన తేదీ గనక మారకుండా ఉంటే థర్డ్ వేవ్ ముగింపుదశలో వచ్చే మొదటి భారీ చిత్రం భీమ్లా నాయక్ అవుతుంది.


Share

Related posts

స్వచ్ఛ్‌భారత్ విజయం: మోదీ

sarath

Dharmavarapu Subramanyam: ధర్మవరపు సుబ్రహమణ్యం మరణించే అఖరి క్షణాల్లో అందరి కళ్ళలో నీళ్ళు తిరిగేలా ఏమి చేసారో తెలుసా??

Naina

సర్కారు వారి పాట విషయంలో అందరికీ మబ్బులు విడిపోయాయి..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar