Bigg Boss Ott: బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `డిస్నీ ప్లస్ హాట్‌స్టార్`లో 24/7 ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. `బిగ్‌బాస్ నాన్‌స్టాప్` పేరుతో గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ షోలో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. రోజురోజుకు రంజుగా కొనసాగుతున్న ఓటీటీ బిగ్‌బాస్.. ఇప్పటికే ఆరు వారాలను పూర్తి చేసుకుంది.
ఇప్పటివరకు ఆరుగురు(ముమైత్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి) ఎలిమినేట్ అవ్వగా.. మొదటి వారం బయటకు వెళ్లిన ముమైత్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం హౌస్‌లో 13 మంది కొనసాగుతున్నారు. ఈ 13 మందిలో ఐదుగురు ఫైనల్‌కి వెళ్తే.. మిగిలిన ఎనిమిది మంది ఎలిమినేట్ కావాలి.
అయితే ఇంకా ఆరు వారాలే ఉండటంతో.. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారట. ఈ వారం మిత్ర శర్మ, నటరాజ్, మహేశ్ విట్టా, అషూ రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్ నామినేషన్లో ఉన్నారు. బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్‌లు టాప్ ఓటింగ్‌తో దూసుకుపోతున్నారు.
అలాగే నటరాజ్, మహేశ్ విట్టా, అషూ రెడ్డి, హమీదాలు బాగానే పర్ఫామ్ చేస్తుండటంతో.. వీరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సలు లేవు. మిత్ర శర్మ విషాయానికి వస్తే.. ఈమె ప్రతి వారం నామినేషన్లోకి వచ్చినా సేవ్ అవుతూనే ఉంటుంది. ఇక మిగిలింది స్రవంతి, ముమైత్ ఖాన్‌లే. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలే ఆదివారం సాయంత్రం ఔట్ అవ్వబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో మరి కొన్ని గంటల్లో తెలియనుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!