RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఆర్ఆర్ఆర్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. మార్చి 25వ తారీకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా.. రికార్డు స్థాయి కలెక్షన్ల తో సునామి వసూలు కురిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు వందల యాభై కోట్లకు పైగా అదేవిధంగా హిందీ లో 200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తూ ఇంకా.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. “ఆర్ఆర్ఆర్” సినిమా ముఖ్యంగా మరోసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయి ఇంటర్నేషనల్ లెవల్లో మరో మెట్టు ఎదిగేవిధంగా… రుజువు చేసింది.
సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీల వరకు సినిమా విజయం సాధించడంలో రాజమౌళి టేకింగ్.., విజువల్ వండర్ .. తెరపై అద్భుతంగా కనిపించిందని కామెంట్లు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలు సల్మాన్, అమీర్ ఖాన్.. ఇంకా చాలా మంది..”ఆర్ఆర్ఆర్” విజయం సాధించడం పట్ల పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో సినిమా ఇంతగా విజయం సాధించడంతో.. రాజమౌళి సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
అనాధ పిల్లల కోసం ఏప్రిల్ తొమ్మిదో తారీకు ప్రసాద్ ల్యాబ్ లో… స్పెషల్ షో వేయించారు. మీ షో కి “ఆర్ఆర్ఆర్” కి పనిచేసిన టెక్నీషియన్లు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ షో కి వచ్చిన డబ్బు కూడా వాళ్ళకే.. అనాధ పిల్లలకే ఖర్చు పెట్టే విధంగా రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలకు పైగా కావస్తున్నా గానీ థియేటర్లకు.. సినిమా ప్రేమికులు ఎగబడుతున్నారు. వీకెండ్ ల తో సంబంధం లేకుండా మామూలు రోజుల్లో కూడా “ఆర్ఆర్ఆర్” కి కలెక్షన్లు వస్తూ ఉండటంతో.. ఇప్పటికే వెయ్యి కోట్లు దాటడంతో… పూర్తి రన్ టైం “ఆర్ఆర్ఆర్” ఎంత వసూలు చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!