బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో స్పెషల్ ఎంట్రీ అయిన గంగవ్వ అనుకోని పరిస్థితుల్లో బయటకు వెళ్ళిపోయింది. ఆమె ఆరోగ్యం సహకరించకపోవడంతో బిగ్బాస్ అనుమతి మేరకు ఆమె ఇంటికి వెళ్ళిపోయారు. ఇక తన సొంత గ్రామం జగిత్యాల కు సమీపంలో లంబాడిపల్లి గంగవ్వ కు ఘనస్వాగతం లభించింది. తన ఇంటి వద్ద ఉన్న మీడియా వారితో మాట్లాడుతూ ఆమె అనేక విషయాలు పంచుకున్నారు.
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తన కొడుకు, మనవళ్ళను చూసి ఆమె చాలా ఆనందంగా ఫీల్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆమె మనవళ్ళు ఆమె తో మాట్లాడుతూ నువ్వు కొద్ది రోజులు ఉండి ఉంటే బాగుండేది అని అన్నారట. ఇక ఆమె ఇంటికి వచ్చిన తరువాత ఆమె ఇంట్లో వాళ్ళు కూడా బిగ్బాస్ చూడడం మానేశారు అని చెప్పింది. ఆమె ఉన్నన్ని రోజులు వారు టీవీ చూశారట. అలాగే తన ఆరోగ్యం గురించి బిగ్బాస్ నిర్వాహకులు బాధపడినట్లు…. నాగార్జున కూడా ఆమెను మంచిగా చూసుకున్నట్లు చెప్పింది. ఇంటి నుండి బయటకు వచ్చేసినందుకు ఆమెకు ఎలాంటి జరిమానా విధించే లేదు అని కూడా స్పష్టం చేసింది.
ఇక నాగార్జున ఆమెకు ఒక సొంత ఇంటిని కట్టిస్తాను అన్న మాట ఇచ్చినట్లు చెప్పిన గంగవ్వ ఎప్పటికప్పుడు ఆమెకు మొబైల్ లో తన ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ ఉన్నారు అని అని చెప్పింది. అలాగే నాగార్జున ఆమెకు ఎప్పటికప్పుడు మందులు పంపిస్తూ డాక్టర్లతో తన ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటూ ఉంటాడు అని చెప్పింది. ఇక ఇంటిలో అందరినీ ఎక్కువగా నవ్వించేది ముక్కు అవినాష్ అని అతడే మస్తుగా జోకులు వేస్తూ ఉంటాడు…. చివరికి గెలిచేది కూడా అవినాష్ అని చెప్పింది. గతంలో ఆమె వచ్చేసిన వారంలో సుజాత తో నువ్వు ఈ వారం ఇంటి నుండి బయటికి వెళ్తావు అని జాతకం చెప్పింది. అదే చివరికి నిజమైంది. దీని ప్రకారం అవినాష్ విజేత గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!