బ్లఫ్ మాస్టర్ రివ్యూ: మాస్టర్ మెప్పించాడు కానీ…

టీజర్, ట్రైలర్ తో మెప్పించిన బ్లఫ్ మాస్టర్, ఆడియన్స్ లో క్యూరియాసిటీ బిల్డ్ చేయడంలో సక్సస్ అయ్యారు. మరి క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. చిన్న తనంలోనే అనాధగా మారి బ్రతకడానికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మారిన ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్), అక్రమ సంపాదన కోసం ఎలాంటి పనులు చేశాడు, ప్రజలని ఎలా మోసం చేశాడు? చివరికి అతను చేసిన పనులు, అతన్ని ఎలా వెంటాడాయి అనేదే బ్లఫ్ మాస్టర్ చిత్ర కథ.

ఒక సినిమాని నేరుగా తీయడం వేరు, ఆల్రెడీ వేరే భాషలో అక్కడి పరిస్థితులకి తగ్గట్లు తెరకెక్కించిన సినిమాని రీమేక్ చేయడం వేరు. రీమేక్ లో రిస్క్ ఉంటుంది. సేమ్ మాతృక లాగే తీస్తే కాపీ అంటారు, మారిస్తే కథలో సోల్ పోయింది అంటారు అందుకే చాలా మంది రీమేక్ సినిమాలు తీయాలనే డేర్ చేయరు. కథపై ఉన్న నమ్మకంతో ఆ డేర్ చేసిన గోపి గణేష్, మంచి లీడ్ ని ఎంచుకోవడంలోనే మొదటి సక్సస్ అందుకున్నాడు. ఉత్తమ్ కుమార్ పాత్రలో సత్యదేవ్ జీవించేసాడు. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. సత్యదేవ్ లేకుండా బ్లఫ్ మాస్టర్ సినిమాని ఊహించడమే కష్టమనే స్థాయిలో అతని యాక్టింగ్ సాగింది. ఇక హీరోయిన్ గా నటించిన నందిత శ్వేత, విలన్ పాత్రలో ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ, పృథ్వీలు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. అయితే మంచి కథగా బాగున్న బ్లఫ్ మాస్టర్ సినిమా కథనంలో మాత్రం నిరాశపరుస్తుంది. ఊహించని మలుపులతో సాగిన మొదటి భాగం అందరినీ కట్టిపడేస్తుంది, అదే రేంజులో సెకండ్ హాఫ్ కూడా ఉంటుందని వెయిట్ చేసిన ఆడియన్స్ కి డైరెక్టర్ పెద్ద డిజప్పాయింట్మెంట్ మిగిలించాడు. ద్వితీయ భాగంలో అక్కడక్కడా కొన్ని సీన్స్ బాగున్నా కూడా ఫస్ట్ హాఫ్ స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు పూర్తిగా శాటిస్ఫై అవ్వరు.

తమిళ సినిమాకి రీమేక్ గా వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమాలో కెమెరా వర్క్ బాగుంది, లైటింగ్ ప్యాట్రన్ సినిమా మూడ్ ని తగ్గులు ఉండడంతో ఆడియన్స్ కి విజువల్ గా నచ్చుతుంది. సాంగ్స్ ఆకట్టుకోలేకపోయినా కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయ్యిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ని సూపర్ గా నడిపించిన కొత్త దర్శకుడు గోపి గణేష్, సెకండ్ హాఫ్ లో కాస్త ట్రిమ్ చేసినా లేదా ప్లే మార్చినా బ్లఫ్ మాస్టర్ సినిమా అందరికీ నచ్చే సినిమా అయ్యేది. ఓవరాల్ గా చెప్పాలి అంటే బ్లఫ్ మాస్టర్ సినిమా డైలాగ్స్ కోసం, హీరో యాక్టింగ్ కోసం చూడొచ్చు. వన్ టైం వాచ్చబుల్.