బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేస్ అదేవిధంగా కన్నడ ఇండస్ట్రీ లో బయట పడుతున్న డ్రగ్స్ కోణం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. తాజాగా “రేసుగుర్రం” సినిమాలో బన్నీ తో నటించిన విలన్ రవి కిషన్ డ్రగ్స్ కేసులో అడ్డంగా ఇరుక్కున్నట్లూ వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే బాలీవుడ్ డైరెక్టర్ కశ్యప్… రవి కిషన్ పై సంచలన ఆరోపణలు చేశారు.
కశ్యప్ ఇటీవల మాట్లాడుతూ….. నటుడు . రవి కిషన్ కి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని…. కానీ అతను తీసుకుంటున్నట్లు ఏ ఒక్కరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడతారని షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో తనపై వస్తున్న ఆరోపణలకు రవికిషన్ స్పందిస్తూ అనురాగ్ కశ్యప్ చేసినకామెంట్స్ లో వాస్తవం లేదని ఖండించారు. నేను శివుడి భక్తుడని నాకు ధూమపానం చేసే అలవాటు ఉంది.
కానీ ప్రజాస్వామ్యంలోకి వచ్చాక ఎంపీ అయిన తర్వాత చాలా దురలవాట్లకు దూరంగా ఉన్నానని . రవి కిషన్ చెప్పుకొచ్చారు. అసలు అనురాగ్ కశ్యప్ నుండి ఇలాంటి కామెంట్లు నా మీద వస్తాయని ఊహించలేదని పేర్కొన్నారు. గతంలో మాదకద్రవ్యాల పై పోరాడిన సమయంలో అతడు నాకు సపోర్ట్ ఇవ్వలేదని బాధ పడ్డాను అని రవి కిషన్ చెప్పుకొచ్చారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!