Boyapati Ram: వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పోతినేని 2019 వ సంవత్సరం లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నటించిన రెడ్ సినిమా కూడా… సూపర్ డూపర్ హిట్టయ్యింది. దీంతో ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా… ఒక పవర్ ఫుల్ సబ్జెక్ట్ కలిగిన సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తమిళ్ మరియు తెలుగు లో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ మాస్ పల్స్ తెలిసిన టాప్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి రామ్ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రామ్ సినిమా కి వచ్చి పది కోట్లు తీసుకుంటున్నాడు.
అయితే బోయపాటి సినిమా కి 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇక ఇదే సమయంలో డైరెక్టర్ బోయపాటి కూడా రెమ్యునరేషన్ పెంచినట్లు టాక్. ఇటీవల తీసిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. బోయపాటి తన రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. దీంతో బోయపాటి రామ్ సినిమా కి.. ఇద్దరి రెమ్యునరేషన్ పరంగా 20 కోట్లు పైగానే ఖర్చు జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ గట్టిగా వినబడుతుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!