అధికారులకు చుక్కలు చూపించిన దీపిక… ఆ చాట్ నిజమేనట?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు విచారిస్తుంటే డ్రాగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అయన మరణంతో అప్పటికే బాలీవుడ్ మొత్తం నేపోటిజం అంటూ ట్రోల్ అవ్వగా ఆతర్వాత డ్రగ్స్ కోణం బయటకు రావడంతో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చెయ్యగా ఇటు కన్నడ నటులలో సంజనను అరెస్ట్ చేశారు.

 

అయితే ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లను విచారిస్తున్నారు. ఇక ఇప్పటికే రకుల్ ప్రీత్ ని విచారించగా నిన్న దీపికా పదుకునేను విచారించారు. ఈ కేసుపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది.

ఇక నిన్న శనివారం ఉదయం ముంబైలోని కొలాబాలో ఉన్న ఎన్ సీ బి గెస్ట్ హౌస్ కు దీపికా పదుకొనె హాజరయ్యారు. దాదాపు ఆరు గంటల సమయం పాటు దీపికాను అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో అధికారులు ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా దీపిక 2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. దీపిక తర్వాత సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్ లను విచారించారు.