Devatha Serial: దేవిని ఆదిత్యకు దత్తత ఇవ్వాలని అని అనుకుంటున్న రాధ నిర్ణయాన్ని మార్చడానికి మాధవ్ శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.. అందులో భాగంగానే వాళ్ళ అమ్మ నాన్న పిలిచి తన యావదాస్తిని.. దేవి, చిన్మయికి సరిసమానంగా రాయమని చెబుతాడు.. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రా అని వాళ్ళ అమ్మానాన్న అడిగితే.. ఎప్పటికైనా రాయాల్సిందే కదా అదేదో ఇప్పుడే చేయండి అని అంటాడు మాధవ్.. వాళ్లు కూడా ఆస్తిని ఇద్దరు పిల్లలకు రాయడానికి ఒప్పుకుంటారు..!

రముర్థి రాధను పిలిచి ఆస్తి దేవికి ఈ ఇంట్లో సగం అస్తి రాస్తున్నాం అని చెబుతాడు.. దేవమ్మ పేరు మీద అస్తి రాస్తున్నారా.. వద్దు దేవి కి ఎలాంటి ఆస్తి వద్దు అని అంటుంది. పిల్లల ఇద్దరికీ సమానంగా అనగానే రాయిస్తున్నం. నీకు ఏనాడు ఏ సహాయం చేయలేదు. కనీసం నీ బిడ్డకైనా ఈ ఇంటి ఆస్తి ఇవ్వమనివ్వమని రుక్మిణి అంటుంది. రాధా మొహమాటంలేకుండా నా బిడ్డకు ఎటువంటి ఆస్తి వద్దు అని తేల్చి చెప్తుంది. తను ఏదో ఒకరోజు ఈ ఇల్లు దాటి వెళ్లిపోతుంది కదా అని అంటుంది. పదేపదే వెళ్లిపోతుంది వెళ్ళిపోతుంది అంటున్నావు.. ఎక్కడికి వెళ్లిపోతుందమ్మ అని రామ్మూర్తి అడుగుతారు.. నాన్న అడుగుతున్నాడు కదా రాదా చెప్పు అని అంటాడు మాధవ్..
దేవిని ఆఫీసర్ కి దత్తత ఇస్తానని మాట ఇచ్చాను అందుకే ఆ ఇంటికి వెళ్లి బిడ్డకు ఇంటి ఆస్తి తో పని ఏముంది అని అంటుంది. దేవిని ఆఫీసర్ గారికి దత్తత ఇవ్వడం ఏంటమ్మా అసలు నీకు ఆలోచన ఎలా వచ్చింది అని రముర్తి అడుగుతారు. ఆఫీసర్ కి దేవి అంటే ఎంత ప్రాణమో మీరు చూశారు.. దేవికి కూడా ఆఫీసర్ అంటే అంతే ప్రాణం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది రాధ. శాశ్వతంగా ఆ అబ్బాయికి ఇవ్వడం ఎంటామ్మ అని అంటాడు రాముర్థి.. నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని రాధా అందరి ముందు తన మనసులో ఉన్న నిర్ణయాన్ని కుండ బద్దలు కొడుతుంది. ఈ మాటలు విన్న ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు.