Devatha Serial: చిన్మయి దేవినీ ఎంత పిలిచినా కనిపించదు. దేవి కనిపించకపోయేసరికి చిన్మయి ఏడుస్తుంది. నాకు చెప్పకుండా దేవి ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్లదు . దేవి ఎక్కడికో వెళ్ళి పోయింది అని ఏడుస్తూ ఉంటుంది. అంతలో దేవిని తీసుకొని వాళ్ళ తాతయ్య ఇంట్లోకి వస్తాడు. నువ్వు కనిపించలేదు బంగారం దేవి ని అలా బయటకు తీసుకు వెళ్ళాను అని చెబుతాడు. నీకోసమే మామిడికాయలు తెద్దామని తాతతో పాటు తోట కి వెళ్ళాను అక్క అని దేవి చెబుతుంది..!
చిన్మయి దేవి కోసం ఏడవడం చూసిన రాధా ఆలోచనలో పడుతుంది. ఏంటమ్మా రాదా ఆలోచిస్తున్నావు అని రామ్మూర్తి అడుగుతాడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఎదురు చెప్పే హక్కు మాకు లేదు. పెద్ద వాళ్ళం మేము అంటే దేవిని చూడకుండా మా మనసుకి ఏదో సర్ది చెప్పుకుంటాం. మాధవ్ కూడా తన భార్యను కోల్పోయాడు కాబట్టి ఆ బాధ తెలుసు కాబట్టి.. తను కూడా తన బాధను దిగమింగుకుని ఉంటాడు. దేవి లేకుండా క్షణం కూడా ఉండలేదు చిన్మయి. అలా వాళ్ళిద్దరినీ దూరం చేయొద్దు అమ్మ. మా అందరి గురించి వదిలేసేయ్.. నువ్వు దేవి లేకుండా ఒక్క క్షణమైనా ఉండగలవా.. నువ్వు బాధ పడతావు కదా ఈ విషయంలో నిర్ణయం మార్చుకోమని వాళ్ళందరూ చెబుతారు.
కమలను భాష చాలా అపురూపంగా చూసుకుంటున్నాడు.. అదే అదే సత్య ప్రెగ్నెంట్ అయితే ఆదిత్య ఇంకా అపురూపంగా చూసుకుంటాడు అనుకుంటూ ఊహల్లోకి వెళుతుంది దేవుడమ్మ. సత్య నిజంగా ప్రెగ్నెంట్ అయినట్టు.. అప్పుడు ఎలా నడుస్తుందో ఊహించుకుంటూ ఉంటుంది. అలా నడుస్తూ తన దగ్గరకు వచ్చి ఒక వింత కోరిక కోరుకుంటుంది సత్య. ఆ కోరిక విన్న దేవుడమ్మ పగలబడి నవ్వుతుంది. దేవుడమ్మ అలా నవ్వడం చూసిన ఇంట్లో వాళ్ళందరూ తన దగ్గరికి వస్తారు అసలు ఏమైందో అడిగి తెలుసుకుంటారు.