Devatha Serial: అక్కాచెల్లెళ్ల బంధాన్ని కొత్త కోణంలో చూపిస్తూ అందరినీ అలరిస్తుంది దేవత సీరియల్.. నిన్న ఆదిత్య దేవి తన కన్న కూతురు అని తెలుసుకుని దేవి ని కలవడానికి ప్రయత్నించగా మాధవ అడ్డుకుని వాళ్ళ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా ఇంకా ఎప్పుడు దేవిని నిన్ను కలవనివ్వనని చెబుతాడు.. ఆదిత్య దగ్గరలో ఉన్న ఒక గుట్ట దగ్గర కార్ ఆపి రుక్మిణి రుక్మిణి అని అరుస్తాడు.. నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందంటే..!?
ఆదిత్య దేవిని తన కన్న బిడ్డేనని, నువ్వు గర్భవతి అయ్యావని నాకెందుకు చెప్పలేదు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు.. అంతలో పెనిమిటి అని ఒక పిలుపు వినిపిస్తుంది. వెను తిరిగి చూడగా రుక్మిణి కనిపిస్తుంది.. ఎందుకు రుక్మిణి ఇలా చేసావు. నువ్వే దురమయ్యవని అనుకుంటుంటే.. నా రక్తాన్ని నాకు ఎందుకు దూరం చేశావు. నేను తండ్రి అని తెలియకుండానే దేవి నాకు దగ్గరవుతుంటే.. నువ్వు ఎందుకు తనని దూరం చేస్తూ.. నన్ను గుడ్డివాడిని చేసి ఇలా ఆటలు ఆడిస్తున్నావు.. ఎందుకు మా ఇద్దరిని దగ్గరగా కాకుండా దూరం చేస్తున్నావు నాకు సమాధానం చెప్పు రుక్మిణి అని అడుగుతాడు.. అవును నీకు చెప్పలే..ఎట్లా చెప్పాలి.. నా కడుపులో నీ బిడ్డ ఉందని అంటే నువ్వు మా చెల్లి ఒక్కటి అయ్యేవారా.. నన్ను నా బిడ్డను విడిచిపెట్టి మా చెల్లిని పెళ్లి చేసుకునే వాడివా..!? అలా మీ చెల్లెలి కోసం నన్ను బాధపెడతవా.. అలా తన మనసులో ఉన్న ఆవేదన మొత్తం రుక్మిణి ఎదుట వెళ్లగక్కుతాడు.. ఏ రోజు నువ్వు నా బాధ కి కారణం నువ్వేనని బాధ పడలేదు.. కానీ ఈ రోజు నా బిడ్డను నాకు కాకుండా చేసి నరకం చూపిస్తున్నావే.. అందుకు కారణం మాత్రం నువ్వెనని బాధపడుతున్నాను.. నా బిడ్డను నాకు కాకుండా చేసిన పాపం మాత్రం నీదే అంటాడు.. నీ బాధకు కారణం నేనే కావచ్చు పెనిమిటి కానీ.. నీ బాధను తీర్చడానికి మాత్రం నేను కారణం కాలేను.. నన్ను మన్నించు పెనిమిటి అని వెళ్ళిపోతుంది..
కట్ చేస్తే.. దేవి స్కూల్ లో జరిగింది మొత్తం రాధకు చెప్తుంది. మాధవ పిల్లలను హాస్టల్లో జాయిన్ చేస్తున్నట్లు తన నిర్ణయాన్ని చెబుతాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను మాత్రం హోటల్ లో చేర్పిస్తారు అని గట్టిగా చెప్పేస్తాడు.. రేపటి ఎపిసోడ్ లో ఆదిత్య దేవి ని కలవడానికి ఇంటికి వస్తాడు. మాధవ్ తన పిల్లలను కలవడం ఇష్టం లేదని అని చెప్పేసి లోపలికి వెళ్ళి పోతాడు. ఆదిత్య రాధా తో పిల్లలు కలవడం మాధవ్ కి ఇష్టం లేదా.. నీకు కూడానా..!? అని అడగగా నాకు కూడా ఇష్టం లేదు అనేసి రాధా లోపలికి వెళ్ళిపోతుంది.. మరి ఆదిత్య దేవి ని కలుస్తాడా..!? లేదంటే ఎప్పటికీ కలవకుండా ఉండిపోతాడా..!? అనే విషయాలు రేపు ఎపిసోడ్ లో చూద్దాం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!