Dhoni: క్రికెటర్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ ఇంకా కెప్టెన్ గా భారత క్రికెట్ జట్టుకి ఎన్నో సేవలు అందించడం జరిగింది. ధోని కెప్టెన్ అయ్యాక భారత్ క్రికెట్ జట్టు తలరాత ఒక్కసారిగా మారిపోయింది. ధోని నాయకత్వంలో 2007వ సంవత్సరంలో మొదటి టీ20 ప్రపంచ కప్ గెలవడం జరిగింది. ఆ తర్వాత 2011వ సంవత్సరంలో మొదటి వన్డే ప్రపంచ కప్ గెలవడం జరిగింది. ఇండియా టీం ఓడిపోయే చాలా మ్యాచ్లను.. మిడిల్ ఆర్డర్ లో దిగి ధోని ఒంటి చేత్తో గెలిపించడం జరిగింది.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ పరంగా అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించగా ఐపిఎల్ ఆడుతూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో మరొక సినిమా రంగంలో నిర్మాతగా కూడా రాణిస్తూ ఉన్నారు. ఇటీవలే నిర్మాణ సంస్థ ప్రకటించి “లెట్స్ గెట్ మ్యారీడ్” అనే తమిళ సినిమా నిర్మిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ తమిళ నటుడికి ధోని మర్చిపోలేని గిఫ్ట్ అందించారు. పూర్తి విషయంలోకి వెళ్తే కోలీవుడ్ కమెడియన్ యోగికి ఎమ్మెస్ ధోని తన ఆటోగ్రాఫ్ తో కూడిన ఒక క్రికెట్ బ్యాట్ గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.
దీనికి సంబంధించిన ఫోటోలు యోగి బాబు ట్విటర్లో షేర్ చేశారు. “ధోని నెట్స్ లో ప్రాక్టీస్ చేసిన క్రికెట్ బ్యాట్ ను నాకు గిఫ్ట్ గా ఇచ్చారు.. థాంక్యూ సార్” అని ట్వీట్ చేశారు. రమేష్ తమిళమని దర్శకత్వం వహించిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. చాలావరకు ధోని నిర్మాణ సంస్థ బాధ్యతలు మొత్తం ఆయన భార్య సాక్షి చూసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మార్చి నెలలో ఐపీఎల్ టోర్నీ స్టార్ట్ కానుంది. చెన్నై జట్టు తరపున ఆడనున్న ధోని ఇప్పటికే ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది.