సినిమా

SVP: వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.. సర్కారు వారి పాట డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..!!

Share

SVP: తెలుగు సినిమా రంగంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని ప్రత్యేకంగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. హీరో నాగార్జున ఇంకా దివంగత దాసరి నారాయణరావు, హీరో రాజశేఖర్.. ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి సర్కారు వారి పాట డైరెక్టర్ పరుశురాం జాయిన్ అయ్యారు. “సర్కారు వారి పాట” మే 12 వ తారీకు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలు మారు మ్రోగుతున్నాయి. సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

director parusuram sensational comments on ys rajasekhar reddy

మరిముఖ్యంగా ట్రైలర్లో మహేష్ “నేను విన్నాను నేను ఉన్నాను” అనే డైలాగ్ చెప్పటంతో వైసీపీ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సందర్భంగా డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది తాజా ఇంటర్వ్యూలో పరశురామ్ తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే.. “నాకు రాజ‌శేఖ‌ర్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆయ‌న‌కు హీరో వర్షిప్ ఉండేది. ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన `నేను ఉన్నాను.. నేను విన్నాను` అనే పొలిటిక‌ల్ డైలాగ్ నాకు చాలా ఇష్టం. చాలా అర్థం ఉంది అందులో. ఎంత పెద్ద భావాన్ని.. ఇంత చిన్న ముక్క‌లో భ‌లే చెప్పారు అనిపించింది.

అలాంటి సంద‌ర్భం `స‌ర్కారు వారి పాట‌`లో ఒక‌టి వ‌చ్చింది. క‌థానాయిక కీర్తి సురేష్‌కి అలాంటి భ‌రోసానే హీరో ఇవ్వాల్సివ‌చ్చిన‌ప్పుడు ఈ డైలాగ్ ప‌ర్‌ఫెక్ట్ గా స‌రిపోతుంద‌నిపించింది. స్క్రిప్టు రాస్తున్న‌ప్పుడే ఈ డైలాగ్ ఉంది. మ‌హేష్ కూడా ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌లేదు. ఎలాంటి డిస్క‌ర్ష‌న్ లేకుండా.. సెట్లో ఈ డైలాగ్ ఓకే అయిపోయింది“ అని చెప్పుకొచ్చారు ప‌ర‌శురామ్. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు హైదరాబాదులో కూడా పోలీస్ గ్రౌండ్స్ నందు జరుగుతోంది. ముఖ్యఅతిథిగా రాజమౌళి.. త్రివిక్రమ్ వస్తున్నట్లు సమాచారం.


Share

Related posts

అధికారులకు చుక్కలు చూపించిన దీపిక… ఆ చాట్ నిజమేనట?

Teja

పూరి జగన్నాధ్ కంటే స్పీడ్ గా పరశురాం.. సర్కారు వారి పాట ని ఎన్ని రోజుల్లో రిలీజ్ చేస్తున్నాడో తెలుసా ..?

GRK

Anasuya Bharadwaj Saree Traditional Looks

Gallery Desk