సినిమా

Devi Sriprasad: బాలీవుడ్ లో అతిపెద్ద బిగ్ ఆఫర్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్..??

Share

Devi Sriprasad: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి అందరికీ తెలుసు. “దేవి” సినిమాతో అతి చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన దేవి శ్రీ ప్రసాద్ అతి తక్కువ కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. దేవి, ఆనందం సినిమాలకు డిఎస్పీ ఇచ్చిన మ్యూజిక్ అప్పట్లో ఇండస్ట్రీలోని చాలా హైలెట్. ఈ దెబ్బతో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా కి ఆఫర్ అందుకుని.. తిరుగులేని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ దేవిశ్రీ ఇవ్వటం జరిగింది. అన్ని రకాలుగా ముఖ్యంగా మ్యూజికల్ గా “శంకర్ దాదా ఎంబిబిఎస్” బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో… ఇక ఇండస్ట్రీలో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్ గా వరుసపెట్టి ఆఫర్ లు అందుకున్నాడు.Salman Khan has a ear for music: Devi Sri Prasad

శ్రీను వైట్ల, సుకుమార్.. సినిమాలకు రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ గా డిఎస్పి పని చేయడం జరిగింది. ఒకప్పుడు త్రివిక్రమ్ సినిమాలకి కూడా దేవి శ్రీ ప్రసాద్ యే మ్యూజిక్ అందించేవారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే దేవిశ్రీప్రసాద్ కొద్ది నెలల క్రితం అడపాదడపా సినిమాలు చేసే పరిస్థితికి గ్రాఫ్ పడిపోయింది. ఈ తరుణంలో సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప”కి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ మళ్లీ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన “పుష్ప” కి ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ మంచి వర్క్ చేయడంతో చాలా మంది ఫిదా అయ్యారు.Kabhi Eid Kabhi Diwali': Devi Sri Prasad reunites with Salman Khan to offer a a 'Seeti Maar' experience? | Deccan Herald

“పుష్ప” రిలీజయ్యాక బాలీవుడ్ లో అనేక అవకాశాలు పలు సినిమాలకు అందుకుంటున్నాడు. అయితే తాజాగా బాలీవుడ్ లో అతిపెద్ద బిగ్ ఫర్ దేవి శ్రీ ప్రసాద్ కి దక్కినట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే ఫరహాధ్ సమ్జి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ హీరోగా “కబీ ఈద్ కబీ దివాలి” అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్ పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ నీ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన సినిమా యూనిట్ చేయనున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. దాదాపు కన్ఫర్మ్ అయినట్లు భారీ ఎత్తున ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.


Share

Related posts

Narappa: నారప్ప సినిమా వాయిదా..

bharani jella

ప్ర‌భాస్ థ్రిల్

Siva Prasad

Anjali: టాప్ యాంగిల్ నుంచి అంజ‌లి హాట్ పోజులు..ఇప్పుడామె ఏం చేస్తుందో తెలుసా?

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar