Gangubai Kathiawadi: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం `గంగూబాయి కతియావాడి`. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన `మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై` అనే నవలను ఆధారంగా చేసుకుని రూపొందించారు. భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్లపై జయంతిలాల్ గడ, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
అజయ్‌దేవ్‌గణ్, విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, ఇందిరా తివారి తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో వేశ్యగా అలియా భట్ వన్ విమెన్ షో చేసి సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన బలంగా నిలిచింది.
గంగూబాయి పాత్రలో ఆమె పలికించిన హావభావాలు, చూపించిన గాంభీర్యం, పలికిన సంభాషణలు అద్భుతంగా మెప్పిస్తాయి. దీంతో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అలియా నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక టాక్ బాగుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది.
అయితే ఇప్పడుఉ ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్.. మార్చి 25 నుంచి స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!