Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ రవితేజ నటించిన “వాల్తేరు వీరయ్య” ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇటీవలే “వాల్తేరు వీరయ్య” షూటింగ్ జరిగిన స్పాట్ లో సినిమా యూనిట్ మొత్తం మీడియా సమావేశం నిర్వహించటం తెలిసిందే. ఈ సినిమా విజయం పట్ల అందరూ ధీమా వ్యక్తం చేశారు. చాలాకాలం తర్వాత “శంకర్ దాదా ఎంబిబిఎస్” తరహా ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు. రవితేజ కూడా ఇది ఫుల్ మీల్స్ నాన్ వెజ్ సినిమా అని తెలిపారు. ఇక దర్శకుడు బాబీ అయితే సినిమా చూసి ఇంటికి వెళ్ళినాక కూడా వీరయ్య పాత్ర మిమ్మల్ని ఎంతగానో అల్లరిస్తుందని చెప్పడం జరిగింది.
“వాల్తేరు వీరయ్య” నో డౌట్ సూపర్ డూపర్ హిట్ అని ముందుగానే ప్రకటన చేసేసారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మూడింటిలో “వాల్తేరు వీరయ్య” టైటిల్ సాంగ్ తో పాటు బాస్ పార్టీ సాంగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా మరో అప్డేట్ సినిమా యూనిట్ ఇచ్చింది. మాస్ మహారాజా రవితేజతో కలిసి చిరంజీవి మాస్ సాంగ్ కి స్టెప్ లు వేసిన మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ “పూనకాలు లోడింగ్” రేపు సాయంత్రం ఐదు గంటలకు థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఈ రీతిగా “వాల్తేరు వీరయ్య” సినిమా యూనిట్… ఏదో ఒక సాంగ్ గురించి అప్డేట్ ఇస్తూ మూవీ యూనిట్ నెట్టింట సందడి చేస్తుంది.
చాలాకాలం తర్వాత చిరంజీవి మరియు రవితేజ కలిసి నటిస్తూ ఉండటంతో ఈ సినిమా కోసం రవితేజ మరియు మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నయ్య సినిమా తర్వాత రవితేజ.. చిరంజీవితో ఈ సినిమాతోనే స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని రవితేజ కూడా తెలియజేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!