SVP: మే 12వ తారీకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన సర్కారు వారి పాట మొదటిరోజు హిట్ టాక్ సొంతం చేసుకోవడం తెలిసిందే. “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ పెర్ఫార్మెన్స్ కీర్తి సురేష్ గ్లామర్ సినిమా చూసిన ఆడియన్స్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో ఫస్ట్ ఆఫ్ లో కీర్తి సురేష్.. మహేష్ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు .. చూసే ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో మహేష్ చెప్పినట్టుగానే… ఫస్టాఫ్ హీరో హీరోయిన్ ట్రాక్ కోసం ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ వెళ్లే పరిస్థితి నెలకొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన సర్కారు వారి పాట.. హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఒకపక్క పనిగట్టుకుని కొంతమంది హీరోల అభిమానులు నెగిటివ్ ప్రచారం చేసినా గాని… సర్కారు వారి పాట థియేటర్ కి జనాలు పోటెత్తుతున్నారు. ఇదిలా ఉంటే “సర్కారు వారి పాట” సినిమాలో తనకి ఇష్టమైన సాంగ్ గురించి తాజాగా కీర్తి సురేష్ నెటిజన్ లతో పంచుకుంది. “సర్కారు వారి పాట”లో మా మహేష్ సాంగ్ తనకిష్టమైన సాంగ్ అని స్పష్టం చేసింది. ఈ సినిమాలో కాస్త నెగెటివ్ రోల్ లో కనిపించిన గాని… తన పాత్రకి సరిగ్గా న్యాయం చేసింది మహానటి. దీంతో కీర్తి సురేష్ ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు సాంగులో ఎర్రగా తీసేసారు డాన్స్ అంటూ కామెంట్ చేస్తూ పొగుడుతున్నారు.
ఇక ఇదే సమయంలో ఈ రోజు సాయంత్రం కర్నూలు నగరంలో “సర్కారు వారి పాట” సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు భారీ ఎత్తున మహేష్ అభిమానులు ఇప్పటికే ప్రాంగణానికి చేరుకున్నారు. సినిమా యూనిట్ తో పాటు హీరో మహేష్ బాబు కూడా వస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!