బాలీవుడ్ స్టార్ కథానాయకుడు హృతిక్‌రోషన్ ప్రస్తుతం తన `సూపర్ 30` సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. వికాస్ భల్, అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ముందుగా జూలై 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ కంగనా తన సినిమా `మెంటల్ హై క్యా`ను పోటీకీ తీసుకొచ్చింది. అంతటితో ఆగకుండా ఎప్పటి నుండో హృతిక్, తనకు మధ్య ఉన్న వివాదానికి ఆజ్యం పోసింది కంగనా. దాంతో హృతిక్, ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడు. తన నిర్మాతలకు చెప్పి సినిమాను వాయిదా వేయమని కోరాడు. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గణిత మేధావి ఆనంద్‌కుమార్ బయోగ్రఫీ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!