Radhe shyam: ప్రభాస్‌కు సోలో డేట్..కానీ, సంక్రాంతికి రావడం పెద్ద రిస్కే అంటున్నారు..

Share

Radhe shyam: సంక్రాంతి బరిలో రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న మహేశ్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటిల భీమ్లా నాయక్, రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఆర్ఆర్ఆర్ కోసం మహేశ్ సర్కారు వారి పాట, పవన్-రానాల భీమ్లా నాయక్ పోస్ట్‌పోన్ చేశారు. ఇక బరిలో నిలిచింది ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు మాత్రమే. ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు సినిమాలదే సంక్రాంతి సందడంతా అని రికార్డుల వేట వీటిదే అనుకున్నారు.

if radhe-shyam-is released at sankranthi then it will be a big risk

కానీ, ఒమైక్రాన్ దెబ్బతో మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్, కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్ ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర ప్రాంతాలలో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దాంతో ముంబై, ఢిల్లీ సహా మిగతా ప్రాంతాలలోనూ చాలా వరకు నైట్ కర్ఫ్యూతో పాటు అన్నీ మూసివేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక రోజు రోజుకూ వేగంగా విజృంభిస్తున్న కారణంగా థియేటర్స్ మళ్ళీ మూతపడనున్నాయి. దాంతో తప్పని పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుదల చేయలేకపోతున్నామని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

Radhe shyam: రాధే శ్యామ్మ్ సినిమాను రిలీజ్ చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని విశ్లేషకులు అభిప్రాయం

దాంతో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ కు సోలో డేట్ దొరికింది. చిత్రయూనిట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో రాధే శ్యామ్ సినిమాను ప్రకటించిన దాని ప్రకారం జనవరి 14న విడుదల చేయబోతున్నామని మరోసారి మేకర్స్ కన్‌ఫర్మ్ చేసింది. ఇది ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపినప్పటికీ వైరస్ కారణంగా ఇలాంటి పరిస్థితుల్లో రాధే శ్యామ్ సినిమాను రిలీజ్ చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టికెట్ ఇష్యూ ఒకటి ఉంది. ఇప్పుడు కరోనా వైరస్..అన్నీ కలిసి రాధే శ్యామ్ సినిమాకు మైనస్‌గా మారతాయని అంటున్నారు. మరోవైపు చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అవుతుందని ఓ టాక్ వినిపిస్తోంది. ఒకవేళ థియేటర్స్ రిలీజ్ కుదరకపోతే ఓటీటీలోనైనా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ బి కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

16 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago