ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: లాస్యను పూజలో నుంచి పిలిచి కొట్టబోయిన నందు..! అసలు ఏం జరిగిందంటే..!?

Share

Intinti Gruhalakshmi: లాస్య ధాన్య లక్ష్మీ పూజ చేయడానికి గాయత్రి నానా తంటాలు పడి ఇంట్లో వాళ్లందరినీ ఒప్పిస్తుంది.. తప్పదు కదా అంకిత సంతోషం కోసం.. ఇక లాస్య అలా పూజ మొదలు పెడుతున్న గానే నందు ఫోన్ చేస్తాడు.. అర్జెంట్ గా కేఫ్ కి నువ్వు ఒక్కదానివే రా అని లాస్య చెప్పేది వినకుండానే కాల్ కట్ చేస్తాడు.. ఏం జరిగిందోనని పరుగుపరుగున వెళుతుంది.. అసలు నేటి 540 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..!

Intinti Gruhalakshmi: 27 Jan 2022 Episode Highlights
Intinti Gruhalakshmi: 27 Jan 2022 Episode Highlights

లాస్య కేఫ్లో కి వెళ్ళగానే నందు ఎక్కడ అని అందరిని అడుగుతుంది. ఇప్పుడే బయటకు వచ్చారు మేడం అని చెప్పారు. నేను బయట నుంచి వచ్చాను కదా అని లాస్య బయటకు వస్తుంది. అందులో నందు కోన్ ఐస్ క్రీం చేతిలో పట్టుకొని సర్ప్రైజ్ అంటూ లాస్య ముందుకు వస్తాడు. నీకు కోన్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా అందుకే తెచ్చాను. ఐస్ క్రీమ్ ఏంటి నందు నన్ను ఎందుకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే పిలిచాను. వెంకీ పెళ్లి సుబ్బి చావు కొచ్చింది టు నీ హ్యాపీనెస్ నా కొంప ముంచేట్టుంది.. ఏమైందో అని ఎంత కంగారుగా వచ్చానో తెలుసా..

Intinti Gruhalakshmi: 27 Jan 2022 Episode Highlights
Intinti Gruhalakshmi: 27 Jan 2022 Episode Highlights

నీకు కంగారుని నేను కూల్ చేస్తాను కదా లాస్య. సినిమా కి వెళ్దాం.. అటునుంచి అటు పబ్ కి వెళ్దాం.. ఫుల్ ఎంజాయ్మెంట్ అసలు తగ్గేదేలే.. ఇప్పటికైనా నవ్వు వచ్చుగా పచ్చిమిరపకాయ దొరికినట్టుగా రియాక్షన్ ఏంటి చాలా రోజుల నుంచి బయట తిరుగుదాం ఎంజాయ్ చేద్దాం అని అడుగుతున్నావు కదా ఈ రోజు నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం అంటూ నందు వన్ వే లో దూసుకెళ్తూ ఉంటాడు.. ఇక ఆపుతావా నీ గోల అంటూ లాస్య నందు మాటలకు బ్రేక్ వస్తుంది.. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు లాస్య అంటూ నందు అమాయకంగా అడుగుతాడు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా సరేలే ఈరోజు తీసుకెళ్తామని తీసుకెళ్తామని పిలిస్తే అరుస్తున్నావ్ ఏంటి కొత్త కోడలి మొట్టమొదటిసారి ఇంట్లో ధాన్య లక్ష్మీ పూజ చేయడానికి కూర్చున్నాను. పూజ మొదలు పెడుతుండగా నీ ఫోన్ వచ్చింది. పీటల మీద నుంచి లేచి వచ్చేశాను. అంతేగా దానికి ఎందుకు అంత బిల్డప్పు.. పూజ ఇంకోసారి చేసుకోవచ్చు కదా. నా మూడ్ ఎందుకు స్పాయిల్ చేస్తావు. ఆల్రెడీ నువ్వు నా మూడ్ స్పాయిల్ చేసావ్. ఎప్పుడు ఏం చేసినా రాంగ్ టైంకి చేస్తావు. ఛా.. నీ కారణంగా ఇంట్లో నేను పందెం లో ఓడిపోయాను.. నాకు ఎంత షేమ్ గా ఉంటుంది. నేను పూజ లో ఉన్నాను అని చెప్పబోతున్న గా వినిపించుకోకుండా కాల్ కట్ చేశావు. తెలివి ఉండాలి అంటూ నందుని చెడామడా తిట్టడం కేఫ్లో బాయ్స్ చూస్తూ ఉంటారు. అది గమనించిన నందు వెంటనే లాస్యం తీసుకుని కార్ ఎక్కి నుంచి పక్కకు తీసుకు వచ్చేస్తాడు..

Read More: Devatha Serial: ఆదిత్య వాళ్ళ ఇంట్లో దేవి పుట్టినరోజు సంబరాలు.. మాధవ్ ఒప్పుకున్నాడా..!?

ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నందు అంటే.. హా.. వడిలేద్దామని.. వెళ్ళు ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటాను అని లాస్య బదులిస్తుంది. నువ్వు ఎప్పటికీ బాగుపడవు లాస్య. అదే ప్రశ్న నేను నిన్ను అడిగితే ఏం చేస్తావు. నేను ఏం తప్పు చేశానని నువ్వు నా మీదకి అలా ఒంటికాలి మీద వస్తున్నావు. నేను పనిచేసే ఫెలో నా స్టాప్ ముందు నన్ను అవమానించడం తప్పు కదా రేపటి నుంచి నాకు వాళ్ళు విలువ ఇస్తారా.. నాతో మర్యాదగా మాట్లాడతారా.. ఓ అదో పెద్ద ఇంటర్నేషనల్ కేఫె దానికి నువ్వో సీఈవో.. నీ నెత్తి మీద రత్నాలు పొదిగిన కిరీటం ఉంది. నిన్ను ఒక మాట అనేసరికి ఆ కిరీటం జారి కింద పడింది. నీకు అవమానం జరిగింది. అవునా అంటూ లాస్య అంటుంది.. వెటకారం వద్దు లాస్య. నువ్వు అలాంటి కేఫ్ లో పనిచేయడమే వెటకారం నందు. పైగా అటువంటి ప్లేస్ కి వచ్చి నేను నీ పక్కన నిలబడ్డాను చూడు అందుకు నేను సిగ్గు పడుతున్నాను నందు. అవమానం నీకు కాదు నాకు. అవమానంగా అనిపిస్తే నన్ను వదిలేయ్.. నన్ను నీ మొగుడు గా చెప్పుకోకు.. నందు అని లాస్య అనగానే.. నేను చేస్తున్న పని నీకు అవమానంగా అనిపిస్తే నేను ఊరుకోను లాస్య.. దొంగతనం చేసాము మర్డర్ చేసే డ్రగ్స్ అమ్మో నేనేమి సంపాదించడం లేదు కష్టపడి న్యాయంగా డబ్బులు సంపాదిస్తున్నాను. దానికి నేనేమీ సిగ్గు పడటం లేదు. మీకంటూ ఒక డిగ్రీ ఉంది. మనకంటూ  సొసైటీలో ఒక స్టేటస్ ఉంది. వాటన్నింటినీ తాకట్టుపెట్టి చేతకాక ఒక చిన్న జాబ్ జాయిన్ అయ్యావు. పైగా అదేదో ఘనకార్యం చేస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటున్నావు. దీన్ని ఏమంటారో తెలుసా ఏడవలేక నవ్వడం అంటారు.. చావలేక బతకడం అంటారు.. అడుక్కుతినలేక రాజీ పడటం అని లాస్య అనడంతో.. నందు లాస్య నీ కొట్టడానికి చేయి ఎత్తుత్తాడు.. ఆగిపోయావేంటి నందు కొట్టు.. సారీ.. వై సారీ.. నీకు పెళ్ళాం కావాల్సింది ఇందుకే కదా.. మాటంటే పడటానికి.. అవమానిస్తే భరించడానికి.. చి కొడితే తుడిచేసుకోవడానికి.. చెంప పగల కొడితే వెక్కివెక్కి ఏడవడానికి.. నన్ను తులసి లాగా ట్రీట్ చేస్తే నేను పడే లేదని నీకు ముందుగానే చెప్పాను.. ఇక నందు వెళ్ళిపోయి కార్లో కూర్చుంటాడు. లాస్య కూడా వెనక్కి తగ్గి నందు తో మాట్లాడి కాఫీ అంటుంది. అలా వారిద్దరూ కాఫీ తాగడానికి వెళ్తారు..


Share

Related posts

Guava: జామ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూడండి!!

Kumar

Huzurabad By Poll: హూజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేకుల హాట్ కామెంట్స్..!!

somaraju sharma

24 ఏళ్ల ‘నిన్నేపెళ్లాడతా’.. కృష్ణవంశీ తెర వెనక కథ ఇదీ..

Muraliak
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar