Intinti Gruhalakshmi: తులసి పిల్లలకు సంగీతం నేర్పిస్తూ ఉండగా లాస్య నందు వస్తారు. లాస్య వస్తూనే నువ్వు వంటింటికి మాత్రమే పరిమితమయ్యావు అని అంటుంది.. నువ్వు ఇక అంతే అని అంటుంది. దాంతో దివ్యకు కోపం వచ్చి మీకు బిజినెస్ చేసే కెపాసిటీ లేదు అందుకే మీ ఫ్యాక్టరీ మూతపడింది ఆంటీ అని దివ్య కౌంటర్ వేస్తుంది. వీళ్ళు ఎప్పుడు చూసినా తులసికి వత్తాసు పలుకుతారు అని నందు పై విరుచుకుపడుతుంది. లాస్య కి చివాట్లు పెడుతుంది అనసూయమ్మ.. రేపు అంకిత పుట్టినరోజు తన బర్త్ డే ఫంక్షన్ ను గాయత్రి వాళ్ళ ఇంట్లో మేము చేస్తున్నాము అని అంటుంది లాస్య..
మీరెవరు చేయడానికి అని అనసూయమ్మ అడుగుతుంది మేము అంకితకు అత్తయ్య మామయ్య అందుకే చేస్తున్నాము అని అంటుంది. ఓహో ఎన్ని రోజులకు గుర్తొచ్చిందా.. ఇంతకీ మీ కుట్ర ఏమిటి అని అంటుంది అనసూయమ్మ. మీరు చేస్తే చేశారు కానీ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని అంటుంది. ఆ ఫంక్షన్ కి మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అని అంటాడు నందు. మేము ఈ ఫంక్షన్ కి రావాలా వద్దా తులసి నిర్ణయం తీసుకుంటుంది అని అంటుంది అనసూయమ్మ. అదేంటి నందు మనం ఏం చెప్పాలనుకుంటున్నామో అది కూడా చెప్పు అని అంటుంది లాస్య అంటుంది. ఈ ఫంక్షన్ కి మేము తులసిని పిలవాలి అని అనుకోవడం లేదు నందు అనగానే.. మేము రాము అని అనసూయమ్మ చెబుతుంది. అంతలో లాస్య అనసూయమ్మ కి బొట్టు పెట్ట బోతుండగా చెయ్యి అడ్డు పడుతుంది. రాని ఫంక్షన్ కి ఇంత మర్యాదగా పిలవడం ఎందుకు లేమ్మా మీరు వెళ్ళండి అన్నట్టుగా అంటుంది.
తులసి దివ్య, తన అత్తమామలతో కలిసి అంకిత ఫంక్షన్ కి వెళుతుంది. తులసి వాళ్ళు రాగానే గాయత్రీ ఈ ఫంక్షన్ కు ఎందుకు వచ్చారు అన్నట్టుగా చూస్తుంది. ఇక్కడ చాలా హైక్లాస్ వాళ్ళు ఉంటారు. మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది అని అంటుంది. మమ్మీ నువ్వు తులసి ఆంటీ ని ఏమి అనవద్దు. నేను ఈ ఫంక్షన్ కు రమ్మని రిక్వెస్ట్ చేశాను అని అంటుంది అంకిత. కోపం వచ్చిన తులసి హై రేంజ్ అంటే ఏంటి వదిన వాళ్ళు ఎలా ఉంటారు అన్నట్టుగా ఇండైరెక్టుగా గాయత్రి తో మాట్లాడుతుంది తులసి. గాయత్రీ పై తులసి రివర్స్ అవుతుండగా అదే ఫంక్షన్ కి వచ్చిన లాస్య, నందు మౌనంగా ఆ గొడవని చూస్తూ ఉంటారు. ప్రేమ్ శృతి కూడా ఆ ఫంక్షన్ కి హాజరవుతారు. బహుశా వారిద్దరిని పిలిచి అంకిత పిలిచి ఉంటుంది. తులసి గాయత్రీ పై గొడవ పడడం చూసిన ప్రేమ్ వాళ్ళమ్మకు సపోర్ట్ గా నిలుస్తాడు. తులసి గాయత్రిల రచ్చ తరువాయి భాగంలో తెలుసుకుందాం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!