RRR – Bheemla nayak: పవన్ కళ్యాణ్ సడన్‌గా భీమ్లా నాయక్ సినిమాను రిలీజ్ చేయడానికి కారణం రాజమౌళినా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ వినిపిస్తోంది. అసలు ఈ నెలలో పవన్ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ కావడం చాలా కష్టమనే ప్రచారం జరిగింది. మేకర్స్ ఫిబ్రవరి 25తో పాటు ఏప్రిల్ 1వ తేదీని ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 8వ తేదీని కూడా లాక్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందుకే మెగా ప్రిన్స్ హీరోగా నటించిన గని సినిమను ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ చేయడానికి రెడీ అయిన మేకర్స్ అధికారికంగా తేదీతో కూడుకున్న పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. గని పోస్టర్‌తో విడుదల తేదీని అధికారికంగా ప్రకటించగానే ప్రతీ ఒక్కరు భీమ్లా నాయక్ పోస్ట్ పోన్ అవడం ఖాయమని డిసైడైయ్యారు.
కానీ, భీమ్లా నాయక్ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేస్తూ మరోసారి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దాంతో చాలా వరకు దీని వెనక ఏదో స్ట్రాటజీ ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి గని సినిమా వాయిదా వేస్తారని ప్రచారం మొదలైంది. ఇదిలా ఉంటే అసలు ఇంత సడన్‌గా భీమ్లా నాయక్ సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు అంటే దాని వెనక రాజమౌళి బృందం ఉందని చెప్పుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే సంక్రాంతి బరి నుంచి రాజమౌళి టీమ్ భీమ్లా నాయక్ సినిమాను తప్పించారు. అయితే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందు పవన్ సినిమా వచ్చేస్తే తమ ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ళ మీద ప్రభావం ఉండదని భావించినట్టు తెలుస్తోంది.
RRR – Bheemla nayak: భీమ్లా నాయక్ వసూళ్ళ పరంగా సరికొత్త రికార్డులు
ఆర్ఆర్ఆర్ సినిమాను మార్చ్ 25వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. అవతల వారం రోజుల తేడాతో భీమ్లా నాయక్ వస్తే ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్ళ మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని భావించే నెలరోజుల ముందు వచ్చేస్తే అన్ని విధాలా ఆర్ఆర్ఆర్ సేఫ్ అవుతుందని ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక భీమ్లా నాయక్ సినిమా కోసం కూడా అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా భీమ్లా నాయక్ వసూళ్ళ పరంగా సరికొత్త రికార్డులు సృష్ఠించడం ఖాయమని అందరూ చెప్పుకుంటున్నారు. కాగా, రానా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు – స్క్రీన్ ప్లేను అందించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!