NewsOrbit
న్యూస్ సినిమా

RRR: ఓరి నాయనో ‘ఆర్ఆర్ఆర్’ వాయిదా వల్ల , ఎన్ని కోట్లు నష్టమో తెలుసా.. !!

Share

RRR: మూలిగే నక్క మీద తాటికాయ కాదు పెద్ద బండరాయే పడ్డట్టు ఉంది ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య పరిస్థితి. ఎంత చెట్టుకు అంత గాలి అనే సామెత మాదిరిగా ఎంత బడ్జెట్ సినిమాకు అన్ని రకాల లాభాలూ ఉంటాయి..అంతకు మించిన నష్టాలు ఉంటాయి. ఏదైనా భారీ బడ్జెట్ సినిమాకు నష్టాలు వస్తే తీవ్రంగా నష్ఠపోయేది అంతిమంగా నిర్మాతే. ఓ నిర్మాత సినిమాకు ఓ రేంజ్ బడ్జెట్ కేటాయించేది హీరో ఆ తర్వాత దర్శకుడి మీద ఉన్న క్రేజ్ అండ్ మార్కెట్ స్థాయిని బట్టే. అయితే రాజమౌళి సినిమా విషయంలో అది రివర్స్‌గా ఉంటుంది. ఆయనతో సినిమా చేసే ఏ నిర్మాతైనా రాజమౌళి..తర్వాత ఆ సినిమాలో నటించే హీరోను బట్టి బడ్జెట్ కేటాయిస్తారు.

is huge loss for postponement of rrr-
is huge loss for postponement of rrr

ఆర్ఆర్ఆర్ మూవీ ప్రొడ్యూసర్ దానయ్య కూడా అంతే. బాహుబలి సినిమాతో టాలీవుడ్‌లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన రాజమౌళి ఆ తర్వాత ఎన్.టి.ఆర్, రాం చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఓలివియా మోరిస్ లాంటి అగ్ర తారాగణంతో సినిమా అంటే దానయ్యే కాదు బాహుబలి రికార్డ్స్‌తో పాటు ఆర్ఆర్ఆర్ నటీనటులను చూసి దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. అయితే ఇదంతా కరోనాకు ముందు. కాబట్టి అందరిలో ఉన్న అంచనాలు..నిర్మాత దానయ్య పెట్టుకున్న నమ్మకాలు వేరే లెవల్. కానీ కరోనా వేవ్స్ వచ్చి అంతా తారుమారు చేశాయి.

RRR: సునామీలా ఒమిక్రాన్ విస్తృతి..

అధికారికంగా ప్రకటించిన రిలీజ్ డేట్స్ ఇప్పటికీ మూడు సార్లు మార్చారు. తాజాగా జనవరి 7న రిలీజ్ కావాల్సి ఉన్న ఆర్ఆర్ఆర్ నాలుగో సారి వాయిదా వేశారు. అయితే ఒమిక్రాన్ దెబ్బను ముందే ఊహించలేక దాదాపు 20 కోట్ల వరకు ఖర్చు చేసి ముంబై, చెన్నై, బెంగళూరు లో భారీ ఈవెంట్స్, ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ ప్లాన్ మొత్తం దర్శకుడు రాజమౌళీదే. ఊహించని లాభాలు వస్తాయని అత్యాశకు పోయి ప్రమోషన్స్ అంటూ నిర్మాత దానయ్యతో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలకూ నిర్వహించని విధంగా ప్రమోషన్స్ జరిపారు. అయితే సునామీలా ఒమిక్రాన్ విస్తృతి అవుతుండటంతో మళ్ళీ పోస్ట్ పోన్ అన్నారు. దాంతో నిర్మాత ఈ నెల రోజులు ప్రమోషన్స్‌కు పెట్టిన కోట్లు మొత్తం నష్ట్లాల లెక్కలో చేరాయి.


Share

Related posts

Romance: శృంగారం లో ఇద్దరు సమానమైన సుఖం పొందాలంటే ఇదే మంచి మార్గం !!

siddhu

టాప్ డైరెక్టర్ – పవన్ వీరాభిమాని ‘పవర్ స్టార్’ కి రాసిన రివ్యూ పిచ్చ వైరల్ అయ్యింది .. !

siddhu

నిర్మల్ జిల్లాలో సీఎం కేసిఆర్ వరాల జల్లు .. స్థానిక సంస్థలకు నిధులే నిధులే

somaraju sharma