న్యూస్ సినిమా

Sarkaru Vaari Paata: టైటిల్ సాంగ్ డిసప్పాయింట్ చేసిందా..థమన్‌పై ఫ్యాన్స్ అసహనం..?

Share

Sarkaru Vaari Paata: గత కొంత కాలంగా మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ అందిస్తున్న సంగీతం హాట్ టాపిక్ అవుతోంది. సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ సినిమా చూసిన థమన్ పేరే మోగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా…నాని లాంటి మీడియం రేంజ్ హీరోల వరకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. అల వైకుంఠపురములో సినిమా నుంచి వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న థమన్ మళ్ళీ కాస్త సాంగ్స్ విషయంలో డిసప్పాయింట్ చేస్తున్నారు.

is-sarkaru-vaari-paata-title-song-dissappointed-mahesh-fans
is-sarkaru-vaari-paata-title-song-dissappointed-mahesh-fans

అంతేకాదు..ఆయన సాంగ్స్ కాపీ ట్యూన్స్ అంటూ కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా షూటింగ్ తాజాగా కంప్లీట్ అయింది. వచ్చే నెల 12న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా నుంచి థర్డ్ సింగిల్‌గా టైటిల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఇంతకముందు కళావతి, పెన్నీ సాంగ్స్ వచ్చి బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కళావతి ట్రెండింగ్‌లో నిలిచింది.

Sarkaru Vaari Paata: పాట విషయంలో మాత్రం అంచనాలు తప్పాయని అర్థమవుతోంది.

దాంతో ఇప్పుడు వచ్చిన సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ మీద అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే, తాజాగా వచ్చిన ఈ సాంగ్ ఆశించినంత రేంజ్‌లో లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. లిరిక్స్ కూడా సాలీడ్‌గా ఉంటాయని భావించిన అభిమానులను డిసప్పాయింట్ చేసిందని టాక్ వినిపిస్తోంది. మామూలుగా అయితే, థమన్ టైటిల్ సాంగ్ ఇవ్వడన్‌లో ఎక్స్పెర్ట్. కానీ, సర్కారు వారి పాట విషయంలో మాత్రం అంచనాలు తప్పాయని అర్థమవుతోంది. చూడాలి మరి విజువల్‌గా ఈ సాంగ్ సినిమాలో ఆకట్టుకుంటుందేమో.


Share

Related posts

బిగ్ బాస్ 4: హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయాక పొలంలో పనులు చేసుకుంటున్న అందాలభామ..!!

sekhar

వెల్లూరు లోక్ సభ ఎన్నిక రద్దు

sarath

Shilpa Manjunat Random clicks

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar