సాధారణంగా కుటుంబంలో తండ్రంటే కూతుళ్లకే ప్రేమ ఎక్కువగా ఉంటుందని వింటుంటాం. కొన్ని సందర్భాల్లో చూసి కూడా ఉండొచ్చు. ఇప్పుడు అలాంటి తనయ ప్రేమను తన తండ్రిపై చూపిస్తుంది అమియా దేవ్. ఈమె ఎవరో కాదు.. ప్రముఖ వెటరన్ క్రికెటర్ కపిల్ దేవ్ కుమార్తె.ఇంతకు ఈమె చేస్తున్నదేంటి అని తెలుసుకోవడానికి వివరాల్లోకెళ్తే…
1983లో ఇండియన్ క్రికెట్ టీం విశ్వ విజేతగా నిలపడంలో కపిల్‌దేవ్ కీలక పాత్ర పోషించాడు. కపిల్ , అయన టీం సభ్యులు చేసిన ఈ అద్భుత ప్రయాణాన్ని ఓ సాహసంగా కూడా అభివర్ణించవచ్చు. ఈ సాహస ప్రయాణాన్ని వెండితెరపై తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు విష్ణు ఇందూరి. ఈయనకు తోడుగా మధు మంతెన, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ తలో చేయి వేస్తున్నారు. `83` పేరుతో ఇండియన్ టీం వరల్డ్ కప్ ప్రయాణాన్ని రూపొందిస్తుండగా ఈ సినిమాకు సంబంధిచిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రణవీర్ సింగ్ ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఎంటైర్ యూనిట్‌కు సంబంధించిన నటనకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్.. కాస్ట్యూమ్స్, డిపార్ట్మెంటల్ షెడ్యూల్ వర్క్నంతటినీ అమియా దేవ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. కపిల్ అండ్ టీంకు సంబంధించిన బయోపిక్ కావడంతో అమియా అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తుందట మరి. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయబోతున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!