Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” మే 12వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. వరుస విజయాల మీద ఉన్న మహేష్.. కచ్చితంగా “సర్కారు వారి పాట” మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమాగా ఉన్నాడు. సినిమా ప్రాజెక్టు ఓకే చేసిన సమయంలోనే అనదర్ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కి స్టార్టింగ్ అంటూ తనదైన శైలిలో సోషల్ మీడియా లో కామెంట్ పెట్టడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఇటీవల ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అదేవిధంగా ఎన్టీఆర్ “ఎవరు మీలో కోటీశ్వరుడు” షోకి వచ్చిన సమయంలో కూడా “పోకిరి” మాదిరిగా “సర్కారు వారి పాట” ఉంటుందని మహేష్ చెప్పటంతో సినిమాపై అంచనాలు డబల్ త్రిబుల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఇటీవల “వాలెంటైన్స్ డే” నాడు సినిమా నుండి మ్యూజికల్ మెలోడీ కళావతి సాంగ్ రిలీజ్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతూ ఉంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాక ఇతర దేశాల్లో కూడా ట్రెండింగ్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది. తమన్ అందించిన మెలోడీ మ్యూజిక్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పైగా సాంగ్ వీడియో లో మహేష్ బాబు వేసిన స్టెప్పులు మరింతగా ఆకర్షించడంతో పాటు వైరల్ అవుతున్న టంతో నిన్ననే కూతురు సితార “కళావతి సాంగ్” లో మహేష్ వేసిన స్టెప్పులు వేయగల నేడు హీరోయిన్ కీర్తి సురేష్ కూడా.. మహేష్ వేసిన స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.
కీర్తి సురేష్ వేసిన స్టెప్పులు … అంతగా అలరించలేదు అని.. మహేష్ బాబు కి సూటైన స్టెప్పులు సేమ్ డిట్టో కూతురు సితార వేసిందని.. కీర్తి సురేష్ స్టెప్పులతో పోలుస్తూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ లో … మహేష్ పాల్గొన్నట్లు ఈ వారం చివరిలో సినిమా మొత్తం కంప్లీట్ చేయనున్నట్లు టాక్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!