బిగ్‌బాస్ తాజా సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్ నుంచి పలువురు ప్రముఖ కంటెస్టంట్లు బయటకు వచ్చారు. వచ్చిన అనంతరం బిగ్‌బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు సైతం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 గురించి ఈ రోజుల్లో సినిమా ఫేమ్, నటుడు కుమార్ సాయి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్ నిర్వాహకులు తనకు ఎక్కువేం ఇవ్వలేదంటూ కామెంట్ చేశాడు.
తనకున్న ప్రత్యేక క్రేజ్ తో బిగ్‌బాస్ హౌస్‌లో నటుడు కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఇతర కంటెస్టంట్లతో మంచి అనుబంధం కొనసాగిస్తూనే… సేప్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఇది తనకు కలిసి రాకపోవడంతో బిగ్‌బాస్ హౌస్‌లో అందరికి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలోనే నామినేట్ అయి.. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాడు. అయితే, బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్లతో పాటు నిర్వాహకులు సైతం ఆయనపై కక్షపూరితంగా వ్యవహరించి.. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చే విధంగా చేశారని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలోనే ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కుమార్ సాయి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు గమనిస్తే.. బిగ్‌బాస్ నిర్వహణ కోసం ఈ సారి తక్కువ బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకూ వచ్చిన సీజన్లలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న వారిని కంటెస్టంట్లుగా తీసుకునే వారు. ఈ సారి మాత్రం అలా చేయలేదు. అయితే ఈ విధంగా నిర్వాహకులు ఆలోచించడానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే కరోనా కారణంగా కంటెస్టంట్లతో సంబంధం లేకుండా బిగ్ బాస్ సీజన్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకు న్నట్టుగా తెలుస్తోంది.
ఈ విషయాన్ని స్పష్టం చేసే విధంగా కుమార్ సాయి తాజా ఇంటర్వ్యూ కొనసాగింది. కుమార్ సాయి ఓ ఇంటర్వ్యూ ప్రకారం.. తనను టార్గెట్ చేసి మరి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే విధంగా ఇతర కంటెస్టంట్లు నడుచుకున్నారని చెప్పారు. నిర్వాహకులు సైతం తన వల్ల పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదని భావించే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించారని రూమర్లు వచ్చిన సంగతి తనకు తెలిసిందని అన్నారు. కుమార్ సాయి తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ.. తనకు లక్షలు లక్షలు ఏమి ఇవ్వలేదనీ, రెగ్యులర్ గా తాను సినిమాల్లో నటిస్తే ఇచ్చేంతనే ఇచ్చారని వెల్లడించాడు. అంటే ప్రస్తుతం కుమార్ సాయి యాక్టర్‌గా డైలీ రూ. 10 వేల వరకూ అందుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే.. బిగ్‌బాస్ కారణంగా కుమార్ సాయి పెద్దగా మనీ పొందింది ఏమి లేదని తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!