Sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఇందులో మహేశ్ లుక్ ఇప్పటికే వచ్చి ఆకట్టుకుంది. ఫ్రీ హెయిర్
స్టైల్.. మెడ మీద 1 రూపాయి కాయిన్ టాటూతో అల్ట్రా మోడ్రన్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ చేస్తుంటే ‘పోకిరి’ తరహా వైబ్స్ ఉన్నాయని స్వయంగా మహేశ్ చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ వస్తున్నాయి.
ఇక సర్కారు వారి పాటలో మహేశ్ పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో మాత్రం మేకర్స్ ఇప్పటి వరకు హింట్ కూడా ఇవ్వలేదు. గతకొన్ని రోజులుగా దీని గురించే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న లీకులు అభిమానుల్లో ఉన్న ఎగ్జైట్మెంట్ను పోగొడుతున్నాయి. ఇక ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ‘కళావతి’ అనే మాంచి మెలోడీ పాట రిలీజైంది. ఈ పాటకు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దాంతో ఈ పాట ఇప్పటికే 35 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది.
Sarkaru vaari paata: మహేశ్ రోల్ ఏంటో లీక్ చేశారు.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్. కళావతి ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇక ఈ మెలొడీకి వచ్చిన రెస్పాన్స్‌తో అనంత శ్రీరామ్ వరుసగా టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సర్కారు వారి పాట మూవీలో మహేశ్ రోల్ ఏంటో లీక్ చేశారు. హీరో ఒక
మొండోడు.. ఎవరూ లేకుండా అనాథగా పెరిగిన వ్యక్తి. తన జీవితంలో అసలు అమ్మాయి వాసన కూడా తెలియని వాడు. ఎప్పుడు చూసినా గొడవల్లో ఉండేవాడు. ఇలాంటి వాడికి ప్రేమ ఒక్కసారిగా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వ్యక్త పరుస్తాడు..అనే ఆలోచన నుంచే కళావతి పాటను రాశాను అని చెప్పుకొచ్చారు. దాంతో ఇందులో మహేశ్ పాత్ర ఏంటో రివీలైపోయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!