NewsOrbit
న్యూస్ సినిమా

Sarkaru vaari paata: పొరపాటున మహేశ్ రోల్ రివీల్ చేసిన ప్రముఖ గీతరచయిత..!

Sarkaru vaari paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఇందులో మహేశ్ లుక్ ఇప్పటికే వచ్చి ఆకట్టుకుంది. ఫ్రీ హెయిర్
స్టైల్.. మెడ మీద 1 రూపాయి కాయిన్ టాటూతో అల్ట్రా మోడ్రన్‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ చేస్తుంటే ‘పోకిరి’ తరహా వైబ్స్ ఉన్నాయని స్వయంగా మహేశ్ చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ నుంచి బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ వస్తున్నాయి.

mahesh role in sarkaru-vaari-paata is revealed by lyricist
mahesh role in sarkaru-vaari-paata is revealed by lyricist

ఇక సర్కారు వారి పాటలో మహేశ్ పాత్ర ఎలా ఉంటుందనే విషయంలో మాత్రం మేకర్స్ ఇప్పటి వరకు హింట్ కూడా ఇవ్వలేదు. గతకొన్ని రోజులుగా దీని గురించే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఎప్పటికప్పుడు బయటకు వస్తున్న లీకులు అభిమానుల్లో ఉన్న ఎగ్జైట్‌మెంట్‌ను పోగొడుతున్నాయి. ఇక ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ‘కళావతి’ అనే మాంచి మెలోడీ పాట రిలీజైంది. ఈ పాటకు అభిమానుల నుంచి, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. దాంతో ఈ పాట ఇప్పటికే 35 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్‌లోనే ఉంది.

Sarkaru vaari paata: మహేశ్ రోల్ ఏంటో లీక్ చేశారు.

ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్. కళావతి ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇక ఈ మెలొడీకి వచ్చిన రెస్పాన్స్‌తో అనంత శ్రీరామ్ వరుసగా టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సర్కారు వారి పాట మూవీలో మహేశ్ రోల్ ఏంటో లీక్ చేశారు. హీరో ఒక
మొండోడు.. ఎవరూ లేకుండా అనాథగా పెరిగిన వ్యక్తి. తన జీవితంలో అసలు అమ్మాయి వాసన కూడా తెలియని వాడు. ఎప్పుడు చూసినా గొడవల్లో ఉండేవాడు. ఇలాంటి వాడికి ప్రేమ ఒక్కసారిగా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా వ్యక్త పరుస్తాడు..అనే ఆలోచన నుంచే కళావతి పాటను రాశాను అని చెప్పుకొచ్చారు. దాంతో ఇందులో మహేశ్ పాత్ర ఏంటో రివీలైపోయింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri