SVP: మహేష్ బాబు సినిమా “సర్కారు వారి పాట” మొదటి నుండి హిస్టరీ క్రియేట్ చేసే సినిమా గానే హైప్ క్రియేట్ చేస్తూ రావడం జరిగింది. గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాంతో మహేష్ సినిమా ఒప్పుకోవడమే అప్పట్లో పెద్ద సంచలనం. ఆ తర్వాత లాక్ డౌన్ సమయంలో సర్కారు వారి పాట అని టైటిల్ ప్రకటించటం మాత్రమే కాదు చెవికి పోగు… మెడ మీద టాటూ… లాంగ్ హెయిర్ లుక్ తో మహేష్ దర్శనమివ్వడం అభిమానులను ఒక్క సారిగా ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత కళావతి సాంగ్.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఇక టైలర్ రిలీజ్ అయినప్పటికీ మహేష్.. ఫుల్ ఎనర్జీతో డైలాగులు చెప్పటంతో పాటు సినిమాలో చాలా జోష్ గా కనిపించడంతో… అభిమానులు పక్కాగా ఇది బ్లాక్ బస్టర్ బొమ్మ అని డిసైడ్ అయిపోయారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో సర్కారు వారి పాట ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఇదిలా ఉంటే హైదరాబాదులో అడ్వాన్స్ బుకింగ్ లో RRR తర్వాత స్థానం ఈ సినిమా దక్కించుకుంది. హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్ లో “RRR” 10.80 కోట్లు కలెక్ట్ చేయగా తర్వాత సర్కారు వారి పాట 6.60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కేజిఎఫ్ 6.56 కోటి రూపాయలు తర్వాత రాధేశ్యాం,.. ఆ తర్వాత బీమ్లా నాయక్. దీంతో సర్కారు వారి పాట బ్రేక్ ఈవెన్ టార్గెట్ 121 కోట్ల రూపాయలు అయింది. ఇటువంటి పరిస్థితుల్లో సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ పడితే.. రెండు మూడు రోజుల్లోనే కలెక్షన్లు వచ్చేస్తాయని ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు విదేశాలలో కూడా భారీగా అడ్వాన్స్ బిజినెస్ ఈ సినిమాకి జరిగినట్లు తెలుస్తోంది. సినిమా చేస్తున్న సమయంలో పోకిరి సినిమా కి చేస్తున్న రోజులు గుర్తొచ్చాయి అని చెప్పటం మాత్రమే కాదు ఆ తరహాలోనే విజయం సాధిస్తుందని మహేష్ చెప్పడంతో.. అభిమానులు మరింత అంచనాలు పెట్టేసుకున్నారు. చూసిన ప్రకటించిన నాటి నుండి చివరి వరకు అంతా కూడా సర్కారు వారి పాటకి పాజిటివ్ వాతావరణం అనుకూలంగా ఉంటూ ఉండటంతో గ్యారెంటీ గా రిజల్ట్ కూడా పాజిటివ్ గానే బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న భావనలో ఫ్యాన్స్ ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!