ఈరోజు టాలీవుడ్ సీనియర్ విలక్షణ నటుడు డా.మంచు మోహన్ బాబు 69వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్ ఓ అమ్మాయిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ట్విట్టర్ ద్వారా ఆయన విషయాన్ని వెల్లడించారు. “నాన్న పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలని బాగా ఆలోచించాను. సిరిసిల్లకు చెందిన అశ్విత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నాను. ఇంత మంచి పనిచేసినందుకు గర్వంగా అనిపిస్తుంది. విద్యానికేతన్ పాఠశాలలో అమ్మాయిని చేర్పించాను. ఆ అమ్మాయి బాగోగులు నేనే చూసుకుంటాను. చదువు చెప్పిస్తాను. జాగ్రత్తగా చూసుకుంటాను. కలెక్టర్ కావాలనే ఆ అమ్మాయి ఆశయాన్ని సాధించడానికి నేను సాయపడతాను. తనకు మంచి జీవితం ఇస్తాను“ అన్నారు మంచు మనోజ్.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!