సెన్సార్ రిపోర్ట్: రెండున్నర గంటల విధ్వంసం

Share

వినయ విధేయ రామ టైటిల్ బయటకి రాగానే సాఫ్ట్ గా ఉంది అన్నారు, పాటలు బయటికి వచ్చాక అంతంతమాత్రగానే ఉన్నాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.. నెగటివ్ ప్రచారం ఎందుకు జరుగుతుందో ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ వినయ విధేయ రామ సినిమాకి మాత్రం సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ జరింగింది. బోయపాటి మరో సరైనోడు తీస్తున్నాడని, చరణ్ కి ఫ్లాప్ తప్పదని ఏదేదో వినిపించాయి కానీ ఎవరు ఏమనుకున్నా కూడా టీజర్ నుంచి ఇప్పటి వరకూ రోజుకో అప్డేట్ ఇస్తూ విమర్శలు చేసిన వారితోనే ప్రశంసించే పరిస్థితి తీసుకొచ్చాడు. ట్రైలర్ తోనే హిట్ సినిమా చూడబోతున్నామే ఫీలింగ్ కలిగించిన బోయపాటి-చరణ్ సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ప్రొమోషన్స్ జరుపుకుంటున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

బోయపాటి మార్క్ సినిమాకి చరణ్ స్టైల్ కలిస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్న వినయ విధేయ రామకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికకేట్ ఇచ్చింది, సెన్సార్ సభ్యుల నుంచి వస్తున్న టాక్ ప్రకారం వినయ విధేయ రామ మూవీలో చరణ్ కెరీర్ బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని, బోయపాటి ఇప్పటి వరకూ తీసిన సినిమాలన్నింట్లోకి ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు రెండున్నర గంటల డ్యూరేషన్ ఉన్న వినయ విధేయ రామ సినిమాకి ఎలాంటి కట్ పడకపోవడం గొప్ప విషయం, ఒక పక్కా కమర్షియల్ సినిమాకి కోత లేకుండా బయటకి వచ్చింది అంటే అది నిజంగానే గొప్ప విషయం. ఇందులో చరణ్ డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ సీన్స్ లో అతని పెర్ఫార్మెన్స్ కానీ సూపర్ గా ఉండబోతుందట, అయితే చరణ్… వివేక్ ఒబెరాయ్ నుంచి గట్టి పోటీ ఉందని తెలుస్తోంది. విలన్ రోల్ ప్లే చేసిన వివేక్, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అందరినీ మెప్పిస్తాడట, తెరపై అతన్ని చూసిన వాళ్లు టాలీవుడ్ కి ఒక మంచి విలన్ దొరికాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మొత్తానికి చరణ్-బోయపాటి కలిసి ఈ సంక్రాంతికి పవర్ ప్యాకెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని ప్రేక్షకుల ముందుకి తెస్తున్నారు. ఈ మూవీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగా అభిమానులు, వినయ విధేయ రామ సినిమాని ఏ రేంజ్ హిట్ చేస్తారో చూడాలి.


Share

Related posts

Radheshyam : రాధే శ్యామ్ ఓటీటీలో రిలీజ్ అయితే నిర్మాతలకి లాభాలా నష్టాలా..?

GRK

ప్రభాస్ ఆ ఒక్క విషయంలో ఎందుకు అంతగా వెనక్కి తగ్గుతున్నాడు ..!

GRK

ఆ ఇద్దరు టాప్ హీరోలకీ మొహం మీదే నో చెప్పేసిన పూజా హెగ్డే .. రగిలిపోతున్న ఫాన్స్ ! 

sekhar

Leave a Comment