చంద్రబాబుకు అసహనం

ఢీల్లీ, జనవరి5: శబరిమలలో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కెరళ ప్రభుత్వం వ్యవహారిస్తోందని బిజేపి జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.   జీవీఎల్ శనివారం ఢీల్లీలో   మాట్లాడుతూ కేరళ సిఎం పినరయి విజయన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం భక్తులను భయపెడుతున్నారని అన్నారు.

తెలంగాణలో ఓటమి తరువాత చంద్రబాబుకు అసహానం పెరిగిందనీ, ఏపీలో కూడా రెండు సీట్లేవస్తాయని జీవీఎల్ ఎద్దెవా చేశారు. బిజేపి మహిళ నేత పట్ల చంద్రబాబు దారుణంగా వ్యవహరించరన్నారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే చిన్నదిగా చూపారనీ, ఎన్ఐఏ దర్యాప్తుకు ఎందుకు అప్పగించలేదనీ, ఎందుకు భయపడుతున్నారని  జీవీఎల్ ప్రశ్నించారు.