Unstoppable 2: మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు ఇద్దరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్ ల దగ్గర యుద్ద వాతావరణం కనిపించేది. నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు హీరోల అభిమానులు ఉండేవాళ్ళు. పోట పోటీగా సినిమాలు చేసే వాళ్ళు. ఒక్కోసారి ఒక్కొక్కలది పై చేయి అయ్యేది. టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ కోసం వీరిద్దరూ మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉండేది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలోస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి అన్నిటిలో కంటే చరణ్… ఎన్టీఆర్ కలిసి నటించిన “RRR” అతి పెద్ద విజయం సాధించింది. అనేక రికార్డులు కూడా క్రియేట్ చేయడం జరిగింది.
కాగా మెగాస్టార్ చిరంజీవితో మల్టీ స్టార్ సినిమా గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే ఆహా ఓటీటీ లో బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాకీ షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 2 స్ట్రీమ్ అవుతుంది. రెండో సీజన్ లో రాజకీయ నేతలు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వస్తున్నారు. ఈ క్రమంలో రెండో సీజన్ 5 ఎపిసోడ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ లు.. సురేష్ బాబు, అల్లు అరవింద్ తోపాటు టాప్ మోస్ట్ డైరెక్టర్లు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి రావడం జరిగింది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజ్ అయింది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ..’సురేశ్ బాబుతో నా అనుబంధం తెలిసిందే. కానీ మనిద్దరి కాంబినేషనే బ్యాలన్స్ ఉంది’ అంటూ అల్లు అరవింద్ తో చెప్పారు. అందుకు అల్లు అరవింద్ మరింత ఆసక్తికరంగా స్పందించారు. ‘మిమ్మల్ని, చిరంజీవిని పెట్టి ఓ సినిమా తీయాలనుందని’ బాలకృష్ణతో అన్నారు. దాంతో బాలయ్య… అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇంకా అనేక విషయాలు గురుంచి వీళ్ళు మాట్లాడుకున్న చాలా సరదా సంబాషణ ఈ ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!