న్యూస్ సినిమా

Nani: ‘అంటే .. సుందరానికీ’ సగం కథ విని లేచి వెళ్ళిపోయాడా..?

Share

Nani: నాని హీరోగా నటించిన మొదటి సినిమా అష్టా చమ్మా నుంచి గత చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ వరకు మిగతా హీరోలకంటే కూడా భిన్నమైన కథలను ఎంచుకుంటూ నేచురల్ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాధించుకున్నాడు. అయితే, విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తున్న నాని, మేకోవర్ పరంగా మాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు. దాంతో కొన్ని సినిమాలు ఆశించిన సక్సెస్ సాధించించలేకపోయాయి. ఇప్పుడు నాని కూడా మేకోవర్ పరంగా కొత్తగా ట్రై చేస్తున్నాడు.

Nani was satisified with the half story itself
Nani was satisified with the half story itself

నాని ద్విపాత్రాభినయంతో వచ్చిన గత చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి కొత్త మేకోవర్స్ ట్రై చేస్తున్నాడు. ఈ సినిమాలో రెండు విభిన్నమైన లుక్స్‌లో అలరించిన నాని త్వరలో రాబోతున్న ‘అంటే .. సుందరానికీ’ సినిమాలో అమాయకంగా మరో డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన నాని లుక్ అందరినీ ఆకట్టుకుంది. దసరా సినిమాలో ఇప్పటి వరకు ఎప్పుడు కనిపించని కంప్లీట్ మాసీవ్ లుక్‌లో మేకోవర్ అయ్యాడు. దసరా ఫస్ట్ లుక్‌తోనే అందరి దృష్ఠిని ఆకట్టుకున్నాడు. ఇంత మొరటు లుక్‌లో నాని కనిపించడం ఇదే మొదటిసారి.

Nani: ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.

అయితే, నాని తాజా చిత్రం ‘అంటే .. సుందరానికీ’ గురించి దర్శకుడు ఇటీవల కొన్ని ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించాడు. ఒక చిన్న లైన్ అనుకొని అప్పటికప్పుడు దాన్ని కథగా తయారు చేసుకున్నాడట. అయితే అది కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే రెడీ చేసుకొని నానికి వినిపిస్తే అది నచ్చి సెకండాఫ్ ఎలా ప్లాన్ చేశావ్ అని అడిగాడట. దానికి దర్శకుడు ఇంకా సెకండ్ హాఫ్ ఏమీ అనుకోలేదని చెప్పాడట. అయినా కూడా సెకండ్ హాఫ్ వినకుండానే మనం ఈ సినిమాను చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోయాడట. ఇక హీరోయిన్ విషయంలో కూడా దర్శకుడు నజ్రియా పేరు చెప్తే..ఆమెనే ట్రై చేయమని కూడా చెప్పాడట. కాగా, ఈ సినిమాను సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.


Share

Related posts

ఓవర్సీస్ విజేత ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…

Siva Prasad

MAA Elections: మా ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్..! నిన్న నాగబాబు..నేడు ప్రకాశ్ రాజ్..! రేపు ఎవరో..?

somaraju sharma

Gouri Gkishan Cute Looks

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar