Naresh Pavitra: సీనియర్ నటుడు నరేష్ పవిత్రా లోకేష్ జంటపై పుకార్ల గురించి తెలిసిందే. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అయింది ఇక అదే నిజమనేలాగా నరేష్ పవిత్ర లోకేష్ ఓ హోటల్లో ఉండగా వారిద్దరినీ రెడ్ హ్యాండెెడ్ గా పట్టించింది నరేష్ మూడో భార్య రమ్య.. ఇదంతా సద్దుమణుగుతుంది అని అనుకుంటుండగా నూతన సంవత్సరం రానున్న సందర్భంగా నరేష్ పవిత్ర లిప్ లాక్ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ”మళ్లీ పెళ్లి” అనే ప్రకటన #PavitraNaresh అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియో వైరల్ అయ్యింది.. ఇదంతా అంతా నిజం అనుకున్నాం.. కానీ ఇదంతా పబ్లిసిటీ కోసం వేసిన ఎత్తుగడ అని తేలింది..
నరేష్ పవిత్ర లోకేష్ మేమిద్దరం మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతేకాకుండా మా ఇద్దరికీ మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ కల్లబుల్లిన డైలాగ్స్ కూడా చెప్పారు ఇదంతా నిజమే అని అంతా అనుకున్నారు కానీ ఇదంతా మళ్లీ పెళ్లి అనే సినిమా ప్రమోషన్లలో భాగమని తెలుస్తోంది ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నరేష్ పవిత్ర మధ్య ఉన్న సన్నని అడ్డుతెరను అడ్డం పెట్టుకొని ఈ సినిమా ప్రమోషన్స్ ను చేశారు ఇప్పటివరకు వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అనే రూమర్స్ గత కొన్నారుగా ఉన్నాయి ఇప్పుడు ఆవిర్ రూమర్స్ ని నిజం చేస్తూ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారేమోనని అంతా అనుకున్నారు కానీ ఇదంతా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన తతంగమని నిదానంగా తేలింది..
నరేష్ పవిత్ర ఇద్దరు కలిసి జంటగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం తాజా ఉదంతాన్ని ఎన్ క్యాష్ చేసుకుంటూ సాగిస్తున్న పబ్లిసిటీ గిమ్మిక్కు అని తెలిసింది.. ఈరోజుల్లో పుకార్లతో బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ పొందొచ్చు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా ఇదే. ఏదైనా అనవసర వివాదాన్ని కెలకడం.. వారి సినిమాకి ప్రచారం చేసుకోవడం నయా ప్లాన్. నరేష్ పవిత్ర జంట కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు. వాళ్ళ మళ్లీ పెళ్లి సినిమాకి కావాల్సినంత ప్రమోషన్ చేసుకున్నారు.. కొత్త సంవత్సరం రాకముందే అందరిని బకరాలను చేశారు నరేష్ పవిత్ర.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ ఈ జంటపై మండిపడుతున్నారు.. ఈ సినిమా వారి ఇద్దరికీ సంబంధిచిన బయోపిక్కు అని కూడా ఫిలింనగర్ లో సెటైర్లు వేస్తున్నారు..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!