నిర్మాత‌ల‌కు షాకిస్తున్న ప్ర‌‌భాస్ నిర్ణయం.. ఏమిటో తెలిస్తే మీరు షాక్ అవ్వడం పక్క!

Share

ఈశ్వ‌ర్‌గా వెండితెర‌కు ప‌రిచ‌య‌మై బాహుబ‌లితో భార‌తీయ సిల్వ‌ర్ స్క్రీన్‌పై తిరుగులేని రికార్డులు సృష్టించిన న‌టుడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. బ‌హుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన పాన్ ఇండియా మూవీ సాహో ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయిన.. బాలీవుడ లో ప్ర‌భాస్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో వ‌చ్చిన ఆ క్రేజ్‌ను నిల‌బెట్టుకోవ‌డం కోసం ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా మూవీల‌నే ఎక్కువ చేస్తున్నాడు.

ఇప్ప‌టికే ప్ర‌భాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న పాన్ ఇండియా సినిమాగా వ‌స్తున్న రాధేశ్యామ్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, త‌మిళంతో పాటు మ‌రిన్ని భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న ఒప్పుకున్న ప‌లు చిత్రాలు సైతం ప‌ట్టాలెక్క‌నున్నాయి. అయితే, త‌న‌తో సినిమాలు తీస్తున్న నిర్మాత‌ల‌కు తాజాగా ప్ర‌భాస్ షాక్ కు గురిచేస్తున్నార‌ట‌.

అదేమంటే.. బ‌హుబ‌లితో పాటు పాన్ ఇండియా సినిమాగా వ‌చ్చిన సాహో త‌ర్వాత భార‌త సీనీ ఇండ‌స్ట్రీలో ప్ర‌భాస్ రెమ్యూన‌రేష‌న్‌తో పాటు ఆయ‌న సినిమా బ‌డ్జెట్‌ల‌పై హాట్ టాపిక్ న‌డుస్తోంది. ప్ర‌భాస్ సినిమాల‌కు నిర్మ‌తాలు భారీగానే బ‌డ్జెట్ కేటాయిస్తున్నారు. అయితే, ప్ర‌భాస్ మాత్రం దానికి విరుద్ధంగా బ‌డ్జెట్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉంటూ.. మ‌రీ ఎక్కువ కాకుండా చూసుకోవాల‌ని సూచిస్తున్నార‌ట‌. అలాగే, ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న రాధేశ్యామ్‌తో పాటు ఇత‌ర చిత్రాల నిర్మాత‌ల‌కు బ‌డ్జెట్ ను త‌గ్గించాల‌ని చెప్పార‌ట‌.

త‌క్కువ బ‌డ్జెట్‌తోనే మంచి పాన్ ఇండియా సినిమాలు తీయ‌డంతో ఎవ‌రికీ.. న‌ష్టం లేకుండా ఉంటుంద‌ని ప్ర‌భాస్ చెప్తున్నార‌ట‌. దీనికి తోడు త‌న రెమ్యూన‌రేష‌న్‌ను కూడా త‌గ్గించుకుంటున్నార‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. అయితే, ప్ర‌భాస్ ఇలా చెప్ప‌డానికి కార‌ణం లేక‌పోలేదు. అదేంటంటే.. భారీ బ‌డ్జెట్‌తో ఇటీవ‌ల మ‌న ముందుకు వ‌చ్చిన ప్ర‌భాస్ మూవీ సాహో బాలీవుడ్ మిన‌హా అన్ని భాష‌ల్లోనూ భారీ డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ఈ న‌ష్టాల నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ త‌న సినిమా బ‌డ్జెట్‌ల విష‌యంలో ఈ నిర్ణ‌యానికి వచ్చిన‌ట్టు తెలుస్తోంది. కాగా, నిర్మాతలు మాత్రం బ‌డ్జెట్ విష‌యంలో వెనుక‌డుగు వేయ‌కుండా భారీ స్థాయిలో ప్ర‌భాస్‌తో సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌మవుతుండ‌టం గ‌మ‌నార్హం. భారీ బ‌డ్జెట్ మూవీ ఆదిపురుష్ సినిమా నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ ఈ విధ‌మైన చ‌ర్చ‌ను నిర్మాత‌ల‌తో జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది.


Share

Related posts

Samantha: నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతకు ఇదే అతి పెద్ద గుడ్ న్యూస్..

Ram

Pawan Kalyan: ప‌వ‌న్ చేసిన ప‌ని మోడీని గుర్తు చేసింద‌ట‌.

sridhar

ఇప్పుడు మేమున్న కష్టాల్లో ఇలాంటి పనులు చేస్తారా ..?

GRK