RRR: పాండమిక్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా భారతీయ చలనచిత్ర రంగం యొక్క హవా కొనసాగుతోంది. సినిమా ధియేటర్ వ్యాపారం కాస్త డ్యామేజ్ అయినా గాని ఓటిటి ప్లాట్ ఫామ్ పుంజుకోవడంతో… “RRR” సినిమా చాలామందికి చేరువయ్యింది. రాజమౌళి పేరు మారుమ్రోగుతుంది. వాస్తవానికి రాజమౌళి తెరకెక్కించిన “బాహుబలి 2” ఎన్నో రికార్డులను సృష్టించడం తెలిసిందే. భారతీయ చలనచిత్ర రంగంలో “బాహుబలి 2” పేరిట అనేక రికార్డులు ఉన్నాయి. కానీ “బాహుబలి 2” సినిమా కంటే “RRR” ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి మంచి పాపులారిటీ తీసుకొచ్చింది.
దానికి ఒకే ఒక కారణం ఓటీటీ అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. “RRR” నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన సమయంలో నాన్ ఇంగ్లీష్ సినిమాగా నెంబర్ వన్ స్థానంలో అత్యధికమైన స్ట్రీమింగ్ అయిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానం కూడా సంపాదించుకోవడం జరిగింది. ముఖ్యంగా హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు “RRR” సినిమాపై స్పెషల్ ఆర్టికల్స్ కూడా రాశారు. జక్కన్న, తారక్, చరణ్ లపై పొగడ్తల వర్షం కురిపించారు. వాళ్లతో కలిసి పనిచేయడానికి కూడా రెడీ అని చాలామంది ఓపెన్ గానే చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా “RRR” ఇటీవల గెలుస్తున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ అవార్డుతో పాటు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ వంటి అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి.
“నాటు నాటు” పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం తెలిసిందే. ఆస్కార్ లిస్ట్ కీ కూడా ఈ సినిమా ఎంపిక అవటం జరిగింది. నామినేషన్ల పరంగా సినిమా స్పెషల్ షోస్ ప్రదర్శించిన మయంలో “నాటు నాటు” పాటకు హాలీవుడ్ ప్రేక్షకుల నుండి భారీ ఎత్తున థియేటర్లలో రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో అమెరికాలో ఓ ప్రముఖ మీడియాకి చరణ్ మరియు ఎన్టీఆర్ సినిమాకి పడ్డ కష్టాన్ని బయటపెట్టారు. ఈ సినిమాలో ఫిజిక్ కోసం దాదాపు ఏడాదిన్నర పాటు వర్కౌట్ చేయడం జరిగింది. రోజుకి మూడు వేల క్యాలరీస్ పెంచుకుంటూ అనుకున్న లుక్ కి రావడానికి ఇద్దరం బాగా కష్టపడ్డామని తారక్ వెరైటీ మ్యాగ్జిన్ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!