NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తాను అని అందరికీ తెలుసు. ఒక్క ఫ్యామిలీ కి మాత్రమే కాక అభిమానులను కూడా ఆ రీతిగానే ఎన్టీఆర్ ట్రీట్ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఏ హీరో అభిమానించని విధంగా తన అభిమానులను ప్రేమించే ఏకైక హీరో ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. అభిమానులు ఆడియో ఫంక్షన్ వదిలే ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా వాళ్లకి జాగ్రత్తలు చెబుతూ అనేక సందర్భాలలో వారితో తనకున్న అటాచ్మెంట్ గురించి ఎన్టీఆర్ కొన్ని కొన్ని విషయాలు చెబుతారు.
ఈ సంగతి పక్కనపెడితే ఇప్పుడు తన అన్న కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న నిర్మిస్తున్న సినిమా బింబిసర కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విషయంలోకి వెళితే ఎన్టీఆర్ వాయిస్ కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటనకు స్టెప్పులకు ఏ రీతిగా రెస్పాన్స్ వస్తుంది అదే రీతిలో ఎన్టీఆర్ వాయిస్ కి కూడా మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి అనేకసార్లు రావడం జరిగింది.
Read More: NTR : పొలిటీషియన్‌గా ఎన్.టి.ఆర్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్లాన్ సూపర్బ్..?
రామ్ చరణ్ “RRR” ఫస్ట్ టీజర్ సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ అన్నిటికన్నా హైలెట్ అయ్యింది అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే విధంగా కళ్యాణ్ రామ్ సినిమా కి ఎన్టీఆర్ ఒక కీలకపాత్ర కి బ్యాక్ గ్రౌండ్ తరహాలో వాయిస్ అందించనున్నట్లు సమాచారం. అంత మాత్రమే కాక ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనాలని డిసైడ్ అయినట్లు.. అన్న కళ్యాణ్ రామ్ కెరియర్ కోసం.. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని ఎన్టీఆర్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వెలువడుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!