న్యూస్ సినిమా

Pooja hegde: రెండు పాన్ ఇండియన్ సినిమాలు అట్టర్ ఫ్లాప్..పూజా గురించి ఆలోచించాల్సిందేనా..?

Share

Pooja hegde: మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే విషయంలో ఇప్పుడు కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో అమ్మడికి వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా మనవాళ్ళు ఆదరించి అవకాశాలిచ్చారు. దాంతో మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠ పురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకుంది. దాంతో మేకర్స్‌కు హీరోలకు లక్కీ హీరోయిన్‌గా మారింది. ప్రభాస్ సరసన రాధే శ్యామ్, తమిళ హీరో విజయ్ సరసన బీస్ట్ వంటి పాన్ ఇండియన్ సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది.

pooja-hegde-two pan indian movies are flop
pooja-hegde-two pan indian movies are flop

అంతేకాదు, ఇప్పుడు త్రివిక్రమ్మ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించే సినిమాలో, హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోతున్న సినిమాల్లో పూజాను హీరోయిన్‌గా తీసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్‌ల సరసన రెండు సినిమాలను చేస్తోంది. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కర్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇలా భారీ చిత్రాలలో నటించే అవకాశాలు అందుకుంటున్న పూజాకు ఇప్పుడు ఎఫ్ 3 మల్టీస్టారర్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది.

Pooja hegde: ఏ హీరోయిన్ నటించినా సినిమా రిజల్ట్ ఇలాగే ..!

అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో పూజా హెగ్డే మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. పూజా నటించిన రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు రాధే శ్యామ్మ్, బీస్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్‌గా మిగిలాయి. పూజా హీరోయిన్‌గా నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అని ఇటీవల దిల్ రాజు చెప్పుకొచ్చారు. అలా చెప్పిన పదిరోజులు కూడా కాకముందే బీస్ట్ అట్టర్ ఫ్లాప్ అని టాక్ వచ్చింది. దాంతో రెండు పాన్ ఇండియన్ సినిమాలలో పూజా నటిస్తే అవి రెండు పెద్ద ఫ్లాప్స్‌గా మిగిలాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పూజా ఫ్యాన్స్ మాత్రం కథ బాగా లేనప్పుడు ఏ హీరోయిన్ నటించినా సినిమా రిజల్ట్ ఇలాగే వస్తుందని అంటున్నారట.


Share

Related posts

బాబోయ్ మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అంటూ ఆ ఇద్దరు టాప్ కంటెస్టెంట్ కి దిమ్మతిరిగే డైలాగ్ వేసిన అభిజిత్..!!

sekhar

అందుకే రాజధాని మార్చేస్తున్నారు… అసలు స్టోరీ చెప్పిన…!!

sekhar

చిరంజీవి చెప్పారు..మేము తప్పక పాటిస్తాం…!!

DEVELOPING STORY