Back Door : హీరోయిన్ పూర్ణ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా బ్యాక్ డోర్.. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను విడుదల చేయగా విశేష స్పందన లభించింది.. తాజగా ఈ సినిమా నుంచి “నీవు దాచుకున్న.. సిగ్గులన్నీ కన్నా”.. నాల్గవ పాటను విడుదల చేశారు మేకర్స్ ..

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాను నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.. బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఇది.. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రేఖ, కో ప్రొడ్యూసర్ ఊట శ్రీను వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ప్రణవ్, రవిశంకర్ సంగీతం సమకూరుస్తున్నారు.