Prabhas: “బాహుబలి” సినిమా తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో దేశవ్యాప్తంగా ప్రభాస్ తో సినిమా చేయడం కోసం… డైరెక్టర్లు నటీ నటులు నిర్మాతలు.. హీరోయిన్లు ఎదురుచూసే పరిస్థితి. ఇలాంటి తరుణంలో హీరోయిన్ జ్యోతికా కి మంచి అవకాశం లభించింది. సూర్యతో పెళ్లయిన తర్వాత చాలావరకు ఇండస్ట్రీకి దూరమైన జ్యోతికా గత ఏడాది లాక్డౌన్ సమయంలో రీ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రభాస్ తో… కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలర్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా స్క్రిప్ట్ హై వోల్టేజ్ యాక్షన్ కమర్షియల్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ప్రభాస్ అక్క పాత్రలో జ్యోతిక యాక్ట్ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ వినిపించినట్లు జ్యోతికా నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.
ప్రభాస్ సినిమాలో డబల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు రాగా హీరోయిన్ పాత్రలో శృతిహాసన్ నటిస్తోంది. కేజిఎఫ్ లాంటి మాస్ హిట్ సినిమా చేసిన డైరెక్టర్ ప్రభాస్ తో సినిమా చేస్తూ ఉండటం తో… “సలర్” సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వాస్తవానికి ఈ క్యారెక్టర్ గురించి ముందే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సూర్య తో డిస్కస్ చేయడం జరిగిందట.. ప్రభాస్ పక్కన కావడంతోపాటు క్యారెక్టర్ కి మంచి డిమాండ్ ఉండటంతో సూర్య కూడా ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేసినట్లు సమాచారం. “కేజిఎఫ్” లో యాష్ ని ఓ రేంజ్ లో చూపించడంతో… ప్రభాస్ ని ఇంకేలా చుపిస్తాడో అని సలార్ హై ఎక్సపెక్టషన్స్ అభిమానులు పెట్టుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!