Prabhas: టాలీవుడ్ రెబల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్.. గొప్ప నటుడే కాదు మంచి ఫుడ్ లవర్ కూడా. అయితే తాను తినడమే కాదు.. తన సినిమాల్లో నటించే నటి నటులకు సైతం రకరకాల వంటలను రుచి చూపిస్తుంటాడు. ఆయన షూటింగ్లో పాల్గొంటే.. ఆ సినిమా టీమ్ మొత్తానికి ఆయన ఇంటి వద్ద నుంచే భోజనం వచ్చేస్తుంది.
ఇక ప్రభాస్ ఆతిథ్యం అందుకున్న వాళ్ళు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తకుండా ఉండలేరు. అంతలా ఫుడ్స్‌తో ఆకట్టుకుంటాడాయన. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఆతిథ్యం అందించాడు. ప్రస్తుతం వీరిద్దరూ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రం చేస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
ఈ మూవీ షూటింగ్లో హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుండగా.. అమితాబ్ ప్రభాస్‌తో కలిసిఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం వీరిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే తనతో కలిసి వర్క్ చేస్తున్న అమితాబ్ బీకి ప్రభాస్ తన ఇంటి విందు భోజనాన్ని రుచి చూపించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న అమితాబ్.. ఆసక్తికర ట్వీట్ చేశారు.
`బాహుబలి ప్రభాస్… నీ అభిమానం కొలవలేనిది. నువ్వు తెచ్చిన భోజనం ఎంత రుచికరమైనదో చెప్పడం కష్టం. నువ్వు పంపిన క్వాంటిటీ చాలా అంటే చాలా ఎక్కువ. ఎంత ఎక్కువంటే ఆర్మీకి భోజనం పెట్టవచ్చు. స్పెషల్ కుకీస్ చాలా రుచిగా ఉన్నాయి. నీ కాంప్లిమెంట్స్ అంత ఈజీగా జీర్ణం కావు` అంటూ ఆయన తన ట్వీట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. దీంతో ఆయన పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
T 4198 – 'Bahubali' Prabhas .. your generosity is beyond measure .. you bring me home cooked food, beyond delicious .. you send me quantity beyond measure .. could have fed an Army ..
the special cookies .. beyond scrumptious ..
And your compliments beyond digestible 🤣— Amitabh Bachchan (@SrBachchan) February 20, 2022
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!