సినిమా

Prabhudeva Chiranjeevi: ప్రభుదేవా ఆధ్వర్యంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్..??

Share

Prabhudeva Chiranjeevi: ఇండస్ట్రీలో కుర్ర హీరోల కంటే వరుసపెట్టి సినిమాలు లైన్ లో చిరంజీవి పెడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన “ఆచార్య” ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఏ మాత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. కనీసం కొరాటాల మార్క్ డైరెక్షన్ ఎక్కడా కనబడలేదు అని సినిమా చూసిన జనాలు అన్నారు. ఇదంతా పక్కనపెడితే ప్రస్తుతం ఒక పక్క మోహన్ రాజు దర్శకత్వంలో “గాడ్ ఫాదర్”.. మరోపక్క “బోలా శంకర్”.. ఇంకా బాబి దర్శకత్వంలో సినిమాలు చిరంజీవి చేస్తున్నారు.

prabhu deva to choreograph chiru and salman

ప్రస్తుతం చేస్తున్న వీటన్నిటిలో “గాడ్ ఫాదర్” సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. మలయాళం “లూసిఫర్” రీమేక్ గా తెరకెక్కుతున్న “గాడ్ ఫాదర్” లో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి స్టెప్పులు కూడా వేయనున్నట్లు సమాచారం. దీంతో ఆ సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవానీ తీసుకోవటం జరిగింది అని టాక్. గతంలో చిరంజీవి పాటలకు ప్రభుదేవా తిరుగులేని స్టెప్స్ వేయించడం జరిగింది. ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ సినిమాలకు ప్రభుదేవా డైరెక్షన్ మాత్రమే కాదు కొరియోగ్రాఫర్ కూడా చేశారు.

prabhu deva to choreograph chiru and salman

ఈ నేపథ్యంలో ప్రభుదేవా అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అని.. చిరంజీవి సినిమా యూనిట్ కి సూచించి.. “గాడ్ ఫాదర్” లో తమన్ అందించిన ఒక ఎనర్జిటిక్ సాంగ్ కోసం.. కొరియోగ్రాఫర్ గా ప్రభుదేవాని తీసుకున్నట్లు సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ ప్రత్యేకంగా ముంబైలో ఒక సెట్ లో జరగనుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక సాంగ్ కోసం త్వరలో ప్రభుదేవా ఆధ్వర్యంలో చిరంజీవితో సల్మాన్ స్టెప్ లు వేయనున్నట్లు.. వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Shilpa Shetty Beautiful Looks

Gallery Desk

Pawan Trivikram: త్రివిక్రమ్ కి అదనపు బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్..??

sekhar

బ్రేకింగ్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు.. భారతీయ చలన చిత్ర చరిత్రలో తొలిసారి..

Vihari