Priyanka Chopra : బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ అయినా నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా తన భర్తతో కలిసి అమెరికాలో లాస్ ఏంజిల్ లో నివసిస్తున్నారు. అయితే గత సంవత్సరంలో ఈ జంట లాస్ ఏంజెల్స్ లో ఓ అందమైన ఇంటిని కొనుగోలు చేశారు. 20 వేల చదరపు అడుగులు ఉన్న ఈ ఇంటిని సుమారు 144 కోట్ల రూపాయలు పెట్టి కొనట్లు తెలుస్తోంది.
గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ఈ గృహ ప్రవేశం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రియాంక చోప్రా తమ నూతన గృహప్రవేశానికి సంబంధించినటువంటి, విషయాన్ని ఫోటోలను ప్రియాంక తన ఆటోబయోగ్రఫి ‘అన్ఫినిష్డ్’లో వివరించింది. ప్రస్తుతం గృహ ప్రవేశ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గృహప్రవేశ సమయంలో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా రూపొందించిన వైట్ ట్యునిక్పై ఆరెంజ్ కలర్ దుపట్టా ధరించి ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రియాంక చోప్రా ఈ సందర్భంగా గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ఓ దర్శకుడు తన పట్ల ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడనే విషయం కూడా తెలియజేసింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రియాంక చోప్రా ప్రస్తుతం ‘టెక్ట్స్ ఫర్ యూ’ అనే హాలీవుడ్ చిత్రం చేస్తుంది . జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భర్త నిక్ జోనస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం వినబడుతుంది. ఇదే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంలో ఓ ప్రత్యేక పాట కోసం దర్శకులు ప్రియాంక చోప్రాను సంప్రదించినట్టు తెలుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!